Bharat - Pakistan: మన దేశంపై ఉగ్రదాడికి కారణమైన పాపిష్ఠి పాకిస్థాన్ కు భారత దేశం కీలెరిగి వాత పెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న అన్ని దౌత్యపరమైన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు మన దేశంలో పాక్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తోన్న 50 మంది పాక్ దేశస్థులను 30కి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు తాజాగా మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దీంతో ఆ దేశంతో మాటలు లేవు.. మాట్లాడాలు లేవు అన్నట్టు పాకిస్థాన్ ను అష్ట దిగ్బందనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాను భారత్ బ్యాన్ చేసింది..
ఆ ట్విటర్ పేజీ ఓపెన్ చేస్తే 'విత్అల్డ్' అని చూపిస్తోంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో ఎలాంటి సంప్రదింపులు చేయమని తెగేసి చెప్పినట్టైయింది. వారితో దౌత్యపరమైన చర్చలకు ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేసింది. అంతేకాదు భారత్, పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య రాక పోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసి పడేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్నీ రద్దు చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్ కు యాక్సెస్ లేకుండా అడ్డుకుని దిమ్మ దిరిగే షాక్ ఇచ్చింది.
భారత్‌లోని పాక్ పర్యాటకులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట సాగుతుంది.
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఎల్‌ఓసీ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు భారత సైన్యం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆపరేషన్ జరుగుతోందని వెల్లడించింది. ఈ రోజు డిఫెన్స్ మినిష్టర్ ఆధ్వర్యంలో అఖిల పక్ష భేటి జరగనుంది. అంతేకాదు ఈ భేటిలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతిపక్షంతో పాటు ఇతర పార్టీలకు వివరించే అవకాశం ఉంది. దేశ భద్రత దృష్ట్యా అన్ని పార్టీలు కేంద్రంలోని ప్రభుత్వానికి బేషరుతుగా మద్దతుగా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









