India - Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..

India - Pak Cross Firing : భారత్, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ ఎల్‌ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. 

Written by - TA Kiran Kumar | Last Updated : May 1, 2025, 09:41 AM IST
India - Pak: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల మోత.. బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత..

India - Pak Cross Firing : ఎల్‌వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ పాక్‌ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. నిన్న పాక్‌ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ధీటుగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి.  

Add Zee News as a Preferred Source

పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. మరోవైపు మన దేశం గగన తలంపై పాకిస్థాన్ యుద్ధ విమానాలతో పాటు సాధారణ విమానాల రాకపోకలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.  దాంతో పాక్‌ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో  భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నారు. ప్రధానంగా జమ్మూ, రాజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో ఈ కాల్పులు జరుగుతున్నాయి.

మరోవైపు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈనెల 24 నుంచి అట్టారీ-వాఘా సరిహద్దు నుంచి 786 మంది పాకిస్తానీయులు తమ దేశానికి వెళ్లారు. ఆ దేశంలో ఉన్న 1,376 మంది భారతీయులు మన దేశానికి తిరిగి వచ్చారు. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే కదా. పాకిస్తానీయులు భారత్‌ వదిలి వెళ్లాలంటూ   డెడ్‌లైన్‌ పెట్టింది. దీనిపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు  జారీ చేసింది. డెడ్‌లైన్‌ లోపు భారత్‌ వదిలివెళ్లాలని, లేనిపక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. షాట్‌ టర్మ్‌ వీసాలకు ఈనెల 26 వరకు, మెడికల్‌ వీసా ఉన్న వారికి ఈనెల 29 వరకు డెడ్‌లైన్‌ ఇచ్చారు. ఇప్పుడు భారత్‌లో ఉన్న పాకిస్తానీయులపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయనున్నారు. పాక్‌, భారత్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఒక మన దేశంలో పాకిస్తానీలు పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News