India Pakistan War:కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో, పంజాబ్‌లోని జలంధర్‌లోనూ పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. సాంబాలో పాక్ డ్రోన్లు దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ సందర్భంగా పెద్ద శబ్దాలు కూడా వచ్చినట్లు సమాచారం.
పంజాబ్‌లోని జలంధర్‌లోనూ రాత్రి 10 గంటల సమయంలో డ్రోన్లు కనిపించాయని అక్కడి డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. నిపుణులు డ్రోన్ల శకలాల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. కాగా ప్రధాని మోదీ ప్రసంగం అయిన కొద్ది సేపటికే పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించడం కీలకంగా మారింది
ఈ సందర్భంగా టెర్రర్ మరియు టాక్స్ ఒకేసారి జరగవన్నారు. మరోవైపు టెర్రరిజం మరియు వ్యాపారం చేయడం అసలు సాధ్యం కాదు. మరోవైపు నీళ్లు, రక్తం ఒకేసారి పారవంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పాకిస్థాన్ వాళ్లకు గట్టి దమ్కీ ఇచ్చారు. భారత్ పై దాడులు చేసిన ఉగ్రవాదులతో పాటు పీవోజేకే ను అప్పగించాల్సిందే అని చెప్పారు. అప్పటి వరకు పాక్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మా మధ్యరావొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మోడీ.
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.