India Pak War: దేవుడా.. భారత్ నుంచి మా దేశాన్ని కాపాడు.. పాక్ ఎంపీ ఏడుపు..

India Pak War: పహల్గామ్ లోని బైసరన్ లోయలో అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన కొన్ని కుటుంబాలకు చెందిన పురుషులను మతం అడిగి మరి ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడికి భారత్ ప్రతిదాడి చేసి పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. మరోవైపు ఈ ఘటనపై పాక్.. భారత్ పై మిస్సల్స్ తో విరుచుకుపడింది. దానికి ప్రతిగా మనం ఎదురు దాడి చేసాము. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన ఓ ఎంపీ ఏడుస్తూ ఓ దేవుడా మా దేశాన్ని కాపాడు అంటున్న వీడియో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 9, 2025, 07:55 AM IST
India Pak War: దేవుడా.. భారత్ నుంచి మా దేశాన్ని కాపాడు.. పాక్ ఎంపీ ఏడుపు..

India Pak War: పాకిస్థాన్ దొంగ దెబ్బకు భారత్ చెప్పి మరి కొట్టింది. దీంతో పాకిస్థాన్ దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఈ దాడుల్లో మన మసూద్ అజహర్ కు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కుక్కు చావు చచ్చారు. దీంతో భారత  ప్రజల ఆగ్రహావేశాలు కాస్తంత చల్లబడ్డాయనే చెప్పాలి. పాకిస్థాన్ కు భారత  త్రివిధ దళాల పవరేంటో భారత ప్రధాని చూపించారు. దీనిక ప్రతిగా నిన్నటి నుంచి పాకిస్థాన్ భారత్ పై మిస్సైల్స్ తో మన దేశంపై దాడికి విఫలయత్నం చేసింది. ఇక పాక్ ప్రయోగించిన మిస్సైల్స్ ను గాల్లోలోనే తిప్పికొట్టింది. మరోవైపు ఏం పాలుపోక.. సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది.

Add Zee News as a Preferred Source

ఈ పరిమాణాల నేపథ్యంలో పాకిస్థాన్  పార్లమెంట్ సభ్యుడు తాహిర్ ఇక్బాల్.. ఓ దేవుడా.. మా దేశాన్ని భారత దాడుల నుంచి కాపాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మన పాకిస్థాన్ దేశం అత్యంత బలహీనంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఈ దేశాన్ని కాపాడాలంటూ అందరం దేవుడిని ప్రార్ధిద్దాం అన్నారు. ఈ ఎంపీ విశ్రాంత సైనికాధికారి  కావడం విశేషం. మేం ఏం చేయలేని పరస్థితుల్లో ఉన్నాము. ఇలాంటి స్థితిలో  పాక్ కు ఆ దేవుడే రక్ష అన్నాడు.  శత్రువును ఓడించే శక్తి మాకు ఇవ్వు అంటూ ప్రార్థించారు.

పాకిస్థాన్ దాడులకు  భారత్ ఎదురు దాడులకు దిగుతుంది. దంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దాయాది దేశం ఏం చేయాలో అసలు అర్ధం కావడం లేదు. మొత్తంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పాక్ పరిస్థితికి ఇది అద్ధం పడుతుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News