India - Pak War: ఓవైపు భారత్.. దాయాది దేశంలోని 9 ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులకు పాక్ అల్లాడిపోయింది. ముఖ్యంగా పలు ఉగ్ర సంస్థకు చెందిన టాప్ లీడర్స్ ఈ దెబ్బకు కుక్క చావు చచ్చారు. మరోవైపు దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ పూంచ్ సెక్టార్ లో కాల్పులకు తెగపడింది. ఈ కాల్పుల్లో 22 మంది భారతీయులతో పాటు ఓ జవాన్ కూడా మరణించాడు. దినేష్ కుమార్ శర్మ అనే జవాన్ అమరుడయ్యాడు. మరోవైపు పాక్ కాల్పులకు పాకిస్థాన్ ధీటుగానే బదులిచ్చింది. ఈట్ కా జవాబ్ పత్తర్ సే అన్నట్టు.. వాళ్లు ఇటుకతో కొడితే.. మనం రాళ్లతో ప్రతీదాడి చేయడమనే స్ట్రాటజీతో భారత్..పాకీ దేశానికి అదే తీరులో బదులిస్తోంది.
మరో 57 మంది సామాన్య ప్రజలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అటు పాకిస్తాన్ రేంజర్ల కాల్పులకు భారత్ ఆర్మీ గట్టిగానే సమాధానం ఇస్తోంది. దీంతో పాకిస్తాన్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేందుకు 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది భారత్. పాక్, POKలో జరిపిన దాడుల్లో దాదాపు 100 మందిని ఉగ్రవాదులు మృతి చెందారు.
ఇప్పటికే సినిమా అయిపోలేదని.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది భారత్. అయితే ఉగ్రవాదులను చంపినందుకు...పాకిస్తాన్ ప్రభుత్వం.. అమాయక భారత పౌరులను టార్గెట్ చేస్తోంది.
మరోవైపు భారత భద్రతా దళాల మాజీ అధికారి మాత్రం పిక్చర్ అభీ బాకీ హై అంటూ పాకిస్థాన్ కు బుద్ది చెప్పాల్సింది చాలా ఉందని చెబుతున్నారు. మన దేశం కూడా పాక్ భూ భాగంలోకి వెళ్లకుండానే.. పీకేజేకేతో పాటు పాకిస్థాన్ లోని ముఖ్య టెర్రరిస్ట్ క్యాంపులను నిర్వీర్యం చేసింది.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









