India - Pak War: పహల్గాం ఉగ్ర దాడితో భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే గత వారం రోజులుగా బోర్డర్ లోఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర సర్కార్ గమనిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రితో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో రక్షణ మంత్రి చర్చలు జరిపారు. ఇప్పటికే ఆర్మీ పారామిలిటరీ సిబ్బందిసెలవులు రద్దు చేశారు అధికారులు.
వెంటనే విధుల్లోకి రావాలంటూ సెలవుల్లో ఉన్నవారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా పాక్ పై చర్యలకు సంబంధించి కీలక ఆదాశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. భారత్, పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నేపథ్యంలో బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
సరిహద్దుల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తోంది కేంద్ర ప్రభుత్వం. పహల్గాం దాడిపై పూర్తి సమాచారాన్ని కేంద్రానికి అందించిన ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్.
కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల అధిపతితో పాటు ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లకు చెందిన అత్యున్నత అధికారులతో సీడీఎస్ భేటి అయ్యారు. అవసరమైతే.. కేంద్రం ఆదేశాలపై పాక్ లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రెక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస భేటీలతో నెక్ట్స్ ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది. జమ్ము కశ్మీర్ లో కలుగుల్లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ముమ్మరంగా గాలింపులు చర్యలు చేపట్టింది ఆర్మీ పారా మిలిటరీ బలగాలు. అంతేకాదు ఎల్ ఓసీతో పాటు ఎల్ ఏసీ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏ క్షణమైనా కీలక ఆదేశాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









