India - Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాన్ని ఎక్కడ నొక్కాలే అక్కడే నొక్కుతుంది భారత్. ఈ చర్యల్లో భాగంగా పాకిస్థాన్ ను ఎండగట్టే చర్యల్లో సింధు నది తర్వాత మరో డ్యాములను క్లోజ్ చేసింది. పాక్ పై భారత్ రెండో ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్ స్లూయిస్ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ చర్యతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని రుజువు అయింది.
900 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యామ్‌ను చీనాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యామ్ పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాక్‌కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఎక్కువగా పంటపొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి.
ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ఆ తర్వాత 29 నాటికే ఈ డ్యామ్ నుంచి పాకిస్థాన్‌కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పాక్‌లోని సియాల్ కోట్ వద్దకు వచ్చేసరికి చినాబ్ పూర్తిగా ఎండిపోయింది. పాక్‌లోని పంజాబ్‌లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం.
ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ముజఫరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల నుంచి హెచ్చరించారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోథి ప్రాంతంలో పీవోకే గుండా పాకిస్థాన్ లో ప్రవహిస్తుంది.
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









