Bangladesh Trade: బంగ్లాదేశ్‌కు షాక్, ఈ వస్తువుల దిగుమతిపై ఇండియా ఆంక్షలు

Bangladesh Trade: మొన్న పాకిస్తాన్..నిన్న టర్కీ..ఇవాళ బంగ్లాదేశ్. ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటోంది. ఆ దేశాలకు షాక్ ఇస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2025, 02:21 PM IST
Bangladesh Trade: బంగ్లాదేశ్‌కు షాక్, ఈ వస్తువుల దిగుమతిపై ఇండియా ఆంక్షలు

Bangladesh Trade: పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తరువాత జరిగిన యుద్ధ పరిణామాలతో పాకిస్తాన్, టర్కీ దేశాలతో ఇండియా వాణిజ్య సంబంధాలు తెంచుకుంది. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌తో వ్యాపారాన్ని కట్ చేసింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వివిధ వస్తువులు, ఆహార పదార్ధాలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

Add Zee News as a Preferred Source

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారిన తరువాత హిందూవులు, ఇతర మైనార్టీలపై గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఆగడం లేదు. గత ఏడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. హిందూవులపై దాడులు జరుగుతున్నాయి. హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను పగలగొట్టారు. మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలోని అరాచకాలను నియంత్రించలేకపోయింది. 

దీనికితోడు ఆ దేశంలో ఇస్కాన్ ప్రతినిధి బంగ్లాదేశ్ సమ్మిళిత్ జాగరణ్ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానపర్చారనేది అతనిపై ఉన్న ఆరోపణ. చిన్మయ్ కృష్ణ దాస్‌ను వెంటనే విడుదల  చేసి హిందూవులపై దాడులు అడ్డుకునేలా ఒత్తిడి తీసుకురావాలంటూ ఆర్ఎస్ఎస్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ తరహా పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ఇండియా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్ధాలపై ఆంక్షలు విధించింది. రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు ఇతర వస్తువుల్ని ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోకుండా పరిమితి విధించింది. ఇండియా ద్వారా నేపాల్, భూటాన్ దేశాలకు సరఫరా అయ్యే వస్తువులకు ఈ నిషేధం వర్తించదు. కేవలం ఇండియాకు దిగుమతి కాకుండా నిషేధం ఉంటుంది. 

ఇకపై బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే పండ్లు, ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెసింగ్ ఫుడ్, బేక్డ్ గూడ్స్, స్నాక్స్, చిప్స్, స్వీట్స్, కాటన్, కాటన్ యార్న్ వేస్ట్, ప్లాస్టిక్, పీవీసీ ఫినిష్డ్ గూడ్స్, రంగులు, గ్రాన్యూల్స్, ఫుడెన్ ఫర్నీచర్ వంటి వస్తువులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఎల్పీజీ గ్యాస్, ఎడిబుల్ ఆయిల్ దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవు .

Also read: Best 7 Seater Cars: 7 సీటర్ ఫ్యామిలీ కారు కోసం చూస్తున్నారా, టాప్ 4 కార్లు ఇవే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News