United Nation: ఉగ్ర కార్యకలాపాలపై పాక్‌ను ఉతికి ఆరేసిన భారత్‌.. ఐక్యరాజ్య సమితిలో అనూహ్యం..

India In UN on Pahalgam Terror Attack: పాక్ ఉగ్ర కార్యకలాపలపై ఐక్యరాజ్యసమితిలో భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. 'విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్' (VOTAN) లాంచ్ సందర్భంగా భారత్ అంబాసిడర్ యోజన పటేల్ ఈ మేరకు ప్రసంగించారు. ఉగ్రవాదం పెంచిపోషిస్తున్నట్లు పాక్‌ రక్షణ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 29, 2025, 10:39 AM IST
United Nation: ఉగ్ర కార్యకలాపాలపై పాక్‌ను ఉతికి ఆరేసిన భారత్‌.. ఐక్యరాజ్య సమితిలో అనూహ్యం..

India In UN on Pahalgam Terror Attack: పహల్గాం అటాక్‌ గురించి.. పాక్ ఉగ్ర కార్యకలాపాలను ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి యోజన పటేల్ ప్రసంగించారు. పాక్‌ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విక్టిమ్స్‌ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్ లాంచ్ సందర్భంగా ఇండియా తరఫున యోజనా పటేల్ ప్రసంగించారు. టెర్రరిస్టులకు ఫండింగ్ చేసినట్లు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. గ్లోబల్ టెర్రరిజాన్ని పాక్ పెంచి పోషిస్తున్నట్టు బహిర్గతమైనది అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే ప్రధానంగా తాము యూఎస్, యూకే కోసమే ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు ఖ్వాజా చెప్పిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Add Zee News as a Preferred Source

పహల్గాం ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అమాయక టూరిస్టులు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలన్నీ ఈ దాడిని ఖండించాయి. ఒక్కసారిగా అటారీ, వాఘా బార్డర్లు కూడా మూసివేశారు. సింధు జలాల ఒప్పందం కూడా భారత్‌ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐక్యరాజ్యసమితిలో పాక్ పై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. పహల్గాం ఉగ్ర దాడి అంశాన్ని ప్రస్తావిస్తూ పాక్‌ దుశ్చర్యను ఎండ గట్టింది. 

ప్రధానంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. అందుకే పహల్గాం ఉగ్రదాడితో పాటు 2008లో జరిగిన 26/11 ముంబై దాడులు కూడా జరిగాయని ఆమె ప్రస్తావించారు. దీనికి పాకిస్తానే బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్‌ కూడా వీడియోలో ఒప్పుకున్న సంగతి తెలిసిందే.  తాము ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు అయితే ఉగ్రవాద సంస్థలకు ఇలా మద్దతు ఇవ్వడం, వారికి నిధులు సమకూర్చి, శిక్షణ ఇవ్వడంపై విషయం ప్రపంచం మొత్తం తెలుసుకుంది. అయితే భారత్ గత కొన్ని ఏళ్లుగా ఒక ఉగ్రవాద సరిహద్దు బాధిత దేశంగా మారిందని ఆమె తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండంగా గత వారం ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాదాన్ని ఖండించాలని బాధిత దేశాలను జవాబుదారిగా చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. 15 దేశాల మండలి కూడా ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని శిక్షించాలని కోరాయి. ఏప్రిల్ 22 మంగళవారం కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది భారత టూరిస్టులు మరణించారు. ప్రధానంగా మతం ఆరా తీసి హిందువులు అయినా మగవాళ్లని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు.

 

 

అయితే ఈ దాడి గురించిన కీలక వీడియో ఎన్‌ఐఏకి చేరింది. ఒక టూరిస్ట్ జిప్ లైన్ లో వెళ్తూ తీసిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. ఆ టూరిస్ట్ మీడియాతో మాట్లాడుతూ నేను స్లైడ్ అవుతుండగానే జిప్ లైన్ ఆపరేటర్ 'అల్లాహు అక్బర్' అని మూడు సార్లు అరిచాడు. ఆ వెంటనే కాల్పులు మొదలయ్యాయి. కాశ్మీరుల్లా కనిపించిన వ్యక్తిపై నాకు అనుమానం ఉంది. నా ముందే 15 మందిని కాల్చి చంపారని చెప్పారు. దీంతో స్థానికులకు అటాక్ గురించి ముందే తెలుసు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

READ ALSO: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా?  

READ ALSO: పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం కీలకనిర్ణయం..48 టూరిస్టు ప్రాంతాల మూసివేత..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News