India vs Pakistan Army Strength: భారత్ - పాకిస్థాన్ మద్య యుద్ధం జరిగితే ఎవరి సైనిక బలం ఎంత..? ఎన్ని యుద్ధ విమానాలు, క్షిపణులు, అణ్వస్త్రాలు ఉన్నాయి

India vs Pakistan Army Strength: పహల్గామ్ దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఇప్పటికే  పరోక్ష యుద్ధం ప్రారంభం అవ్వగా, భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ మధ్య ఒకవేళ యుద్దం గనుక సంభవించినట్లయితే ఎవరి బలం ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Apr 27, 2025, 01:04 PM IST
India vs Pakistan Army Strength: భారత్ - పాకిస్థాన్ మద్య యుద్ధం జరిగితే ఎవరి సైనిక బలం ఎంత..? ఎన్ని యుద్ధ విమానాలు, క్షిపణులు, అణ్వస్త్రాలు ఉన్నాయి

India vs Pakistan Army Strength: కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. దీంతో భారతదేశం పాకిస్తాన్ పైన భగ్గుమంటోంది.  ఇప్పటికే పాకిస్తాన్ పైన ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పాకిస్తాన్ రాజకీయ నేతలు కూడా  భారత్ ను ఉద్దేశిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే భారతదేశం సింధూ నది జలాల పంపిణీ ఒప్పందం నుంచి తప్పుకుంది. దీనిపైన పాకిస్తాన్ వైపు నుంచి కొంత మంది నేతలు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.  

Add Zee News as a Preferred Source

ఇదిలా ఉంటే  ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ , పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష  యుద్ధం జరిగితే, రెండు దేశాల సైనిక శక్తులను ఇఫ్పుడు  పోల్చుదాం. అప్పుడు ఎవరి బలం ఎంతో తేలిపోతుంది. 2025 గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ ప్రకారం, భారత్  సైనిక బలంలో ప్రపంచంలోనే 4వ బలమైన సైనిక శక్తిగా పేరు పొందగా, పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది . 

ఇరు దేశాల మధ్య సైనికుల సంఖ్య :

భారత్ వద్ద 14.6 లక్షల యాక్టివ్ సిబ్బంది, 11.5 లక్షల రిజర్వ్ సిబ్బంది ఉన్నారు. 

పాకిస్తాన్ వద్ద 6.54 లక్షల యాక్టివ్ సిబ్బంది, 5 లక్షల పారా మిలిటరీ సిబ్బంది ఉన్నారు. 

ఎయిర్ ఫోర్స్ బలం: 
భారత్ వద్ద ఉన్న  యుద్ధ విమానాల సంఖ్య : 2,210

యాక్టివ్ ఫైటర్ జెట్‌లు: సుమారు 600పైగా ఉన్నాయి. 

Su-30MKI: 260 పైగా

Rafale: 36 

Mirage 2000: 50 పైగా

MiG-29UPG: 60 పైగా

HAL Tejas: 40 పైగా ఉన్నాయి. 

Also Read: Success Story: ఆయన పేరే ఒక బ్రాండ్.. 115 ఏళ్ల క్రితం పునాది పడి.. రూ. 70,000 కోట్లకు పడగెత్తిన టీవీఎస్.. సక్సెస్ స్టోరీ ఇదే

పాకిస్తాన్ వద్ద ఉన్న  యుద్ధ విమానాల సంఖ్య : 1,434

యాక్టివ్ ఫైటర్ జెట్‌లు: సుమారు 350 వరకూ ఉన్నాయి. 

JF-17 Thunder: 150 పైగా ఉన్నాయి.

F-16 Fighting Falcon: 75 ఉన్నాయి.

Mirage III/V: 80 ఉన్నాయి.

చైనాలో నుంచి కొత్తగా కొనుగోలు చేసిన J-10C : 25 పైగా ఉన్నాయి. 

ట్యాంకులు:

భారత్ వద్ద 4,614 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి.

పాకిస్తాన్ వద్ద 3,742  యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. 

నేవీ బలం:

భారత్ వద్ద 294 నౌకలు, 2 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి.

పాకిస్తాన్ వద్ద 114 నౌకలు మాత్రమే ఉన్నాయి. వారి వద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ లేదు  

న్యూక్లియర్ ఆయుధాలు:

భారత్: 172

పాకిస్తాన్: 170 

రక్షణ బడ్జెట్:

భారత్ రక్షణ బడ్జెట్ ప్రతి ఏడాదికి సుమారు రూ. 6.25 లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. 

పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ ప్రతి ఏడాదికి సుమారు రూ. 63,700 కోట్లు కేటాయిస్తున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News