)
Indian Origin Brutal Murder In USA: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. చంద్రమౌళి నాగమల్లయ్య (50) అనే వ్యక్తిని గొడ్డలితో తలనరికి దారుణంగా హత్య చేశారు. ప్రధానంగా అతని భార్య కొడుకు ముందే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 10వ తేదీన వాళ్ళు నిర్వహిస్తున్న మోటల్లో ఈ హత్య జరిగింది. టెక్సాస్ లోని టెన్నిస్ అండ్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో ఇంటర్ స్టేట్ సమీపంలోని డౌన్ టౌన్ సూట్ మోటల్ల్లో జరిగిందని పోలీసులు తెలిపారు. మార్టినేజ్ అనే వ్యక్తిని అనుమానితుడుగా నిర్ధారించారు పోలీసులు. అతన్ని వెంటనే అదుపులోకి కూడా తీసుకున్నారు.
నాగ మల్లయ్య అతని భార్య కొడుకుతో పాటు మోటల్లో నిర్వహిస్తున్నారు. అయితే నాగ మల్లయ్య తన హోటల్ లో పనిచేస్తున్న మార్టినేజ్ ను పాడైన వాషింగ్ మెషిన్ ఉపయోగించకూడదని మరో సహోద్యోగి మహిళతో మల్లయ్య మార్టినేజ్కు చెప్పించాడు. దీంతో కోపోద్రిక్తుడై మల్లయ్యపై కత్తితో దాడి చేశాడు. వెంటనే మల్లయ్య కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. అయినా అతన్ని వెంబడించి మరీ మోటల్ పార్కింగ్ ప్రాంతంలో దారుణ హత్య చేశారు. అయితే వెంటనే నాగ మల్లయ్య భార్య కొడుకు కూడా రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది వారిపై కూడా నిందితుడు దాడికి దిగాడు.
ఇక కత్తిని కూడా చెత్తబుట్టలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ ఫూటేజీలో పరిశీలించిన అగ్నిమాపక రిస్క్యూ టీమ్ వెంటనే వచ్చి నిందితుడిని వెంబడించి పోలీసులకు అక్కడికి చేరుకునేలోపే అరెస్టు చేశారు. అయితే పోలీసులకు కూడా నిందితుడు లొంగిపోయాడు. నేరాన్ని అంగీకరించాడు ముందస్తు ప్రణాళికగా జరిగిందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ ఘటనతో స్థానిక భారతదేశ సంతతికి చెందిన వాళ్ళు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.