Indonesia: భారత్ కు గుడ్ న్యూస్.. పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తేస్తున్న ఇండోనేషియా!
Indonesia Lifts Palm Oil Export Ban: పామాయిల్ ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా. ఈ నిర్ణయం భారత్ కు ఊరట కలిగించే విషయం.
Indonesia Lifts Palm Oil Export Ban: పామాయిల్‌పై నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ఇండోనేషియా (Indonesia ) ప్రకటించింది. దేశీయ వంట నూనెల సరఫరాల మెరుగుదల నమోదవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇది భారత్ కు ఎంతో ఊరట కలిగించే విషయం. ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారు ఇండోనేషియా. అయితే పెరుగుతున్న దేశీయ వంటనూనెల ధరలను అరికట్టడానికి ఏప్రిల్ 28న ముడి పామాయిల్ మరియు కొన్ని డెరివేటివ్ ఉత్పత్తుల రవాణాను ఆ దేశం నిలిపివేసింది.
''బల్క్ వంట నూనెల సరఫరా ఇప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ స్థాయికి చేరుకుందని...అయితే ఇంకా అనేక ప్రాంతాలలో, వంట నూనెల ధరలు ఇప్పటికీ అధికంగా ఉన్నాయని.. కానీ రాబోయే వారాల్లో తగ్గే అవకాశం ఉందని'' ఓ వార్తా ఛానెల్ తో ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో (Joko Widodo) అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా తగ్గింది. ఇలాంటి సమయంలో పామాయిల్ పై ఇండోనేషియా బ్యాన్ విధించింది. ఎగుమతి నిషేధం కొనసాగితే రాబోయే వారాల్లో పామాయిల్ రంగం ఆగిపోయే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్పత్తిలో నిమగ్నమైన రైతులు, కార్మికులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నిషేధాన్ని సమీక్షించాలని ఇండోనేషియా చట్టసభ సభ్యులు ప్రభుత్వాన్ని కోరిన ఒక నెల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం 17 మిలియన్ల మంది కార్మికుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుంటోందని జోకో విడోడో చెప్పారు. పామాయిల్ ఇండోనేషియా యొక్క ప్రధాన ఆదాయ వనరు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తి చేయబడిన 75 మిలియన్ టన్నుల పామాయిల్‌లో దాదాపు 48 మిలియన్ టన్నుల పామాయిల్‌ను ఆ దేశం కలిగి ఉంది.
Also Read: Srilanka Food Crisis: ఆహార కొరతపై ప్రధాని వార్నింగ్.. తిండి లేక చస్తున్న శ్రీలంక జనాలు
పామాయిల్ ఉపయోగం
పామాయిల్ .... ఇతర రకాల నూనెలకు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఐస్ క్రీమ్‌లు, సబ్బులు, సౌందర్య సాధనాలు మరియు జీవ ఇంధనంతో సహా అన్ని రకాల వస్తువులలో ఉపయోగించబడుతుంది. గత రెండు దశాబ్దాల్లో భారతీయ పామాయిల్ వినియోగం విపరీతంగా పెరిగింది.
భారత్ కు ఊరట
ఇండియాకు ఇండోనేషయా అతిపెద్ద పామాయిల్ ఎగుమతి దారు. ఇప్పుడు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయడంతో దేశీయ మార్కెట్‌లో వంటనూనె ధరలు తగ్గనున్నాయి. భారతదేశం ఏటా దాదాపు 8 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇది మొత్తం దేశీయ ఎడిబుల్ ఆయిల్ వినియోగ బాస్కెట్‌లో దాదాపు 40% వాటాను కలిగి ఉంది. ఆహారం మరియు ఇంధనం ధరల పెరుగుదల కారణంగా భారతదేశంలో రికార్డు స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 7.68% నుంచి ఏప్రిల్‌లో 8.38%కి పెరిగింది. ఈ వార్త గురువారం ప్రకటించినప్పటి నుండి, భారతదేశంలో రిటైల్ ఆయిల్ ధరలు కిలోకు 2 రూపాయలు తగ్గాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook