Donald Trump: ఇరాన్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలనుకుంటోందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఇరాన్ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్‌ను తమ అణు కార్యక్రమానికి ముప్పుగా భావిస్తుందని.. ట్రంప్‌ను చంపేందుకు ప్లాన్ చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ కు ట్రంప్ నంబర్ వన్ శత్రువు. అమెరికా అధ్యక్షుడు సమస్యను పరిష్కరించల సమర్థనాయకుడు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేసేందుకు ఆయన ఎప్పుడూ ఇష్టపడరు. ప్రత్యర్థికి లొంగిపోరు. గతంలోనూ ఆయన ఓ ఫేక్ అగ్రిమెంట్ పక్కన పెట్టి..ఖాసిమ్ సులేమానీని మట్టుబెట్టారు. ఇరాన్ దగ్గర అణ్వాయుద్ధం ఉండకూడదు. అంటే వారు యురేనియంను శుద్ధి చేయరాదు. అందుకోసం ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారారు. అందుకే ఆయనను చంపాలని టెహ్రాన్ ప్లాన్ చేస్తోంది అంటూ నెతన్యాహు ఆరోపణలు చేశారు.
ఇరాన్ ప్రపంచ దేశాలన్నింటికీ పెనుముప్పుగా మారుతోందని ఇజ్రాయల్ ప్రధాని దుయ్యబట్టారు. అందుకే దాడులు చేయడం తప్ప తమకు మరో ఛాన్స్ లేకుండా పోయిందన్నారు. ముప్పును సమూలంగా తొలగించేంతవరకు తమ పోరాటం ఆగబోదంటూ స్పష్టం చేశారు. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ సొంత ప్రజలను మాత్రమే కాదు..యావత్ ప్రపంచాన్నీ రక్షిస్తోందన్నారు.
ఇక ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా ఆ దేశ మిలిటరీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధినేత మరణించగా..తాజాగా ఈ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమీ, ఆయన డిప్యూటీ జనరల్ హసన్ మహాకిక్ కూడా మరణించారు. ఈ విషయాన్ని నెతన్యాహు ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఐఆర్జీసీ నిఘా విభాగానికి చెందిన మరో కీలక అధికారిని కూడా మట్టుబెట్టినట్లు వెల్లడించారు.
కాగా గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ అణు స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులను చేస్తోంది. తాజాగా సోమవారం తెల్లవారుజామున ఫోర్దో న్యూక్లియర్ సైట్ వద్ద భారీ పేలుళ్లు జరిగాయి. దీంతో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదు అయినట్లు సమాచారం. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 14 మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు మరణించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









