Iran Riots 500 People Died: ఇరాన్ లో జరిగిన అల్లర్లలో పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనధికారికంగా 450 మందికి పైగా మృతి చెందారని సమాచారం. ఇక అధికారికంగా 203మంది చనిపోయినట్లు చెబుతున్నారు. మృతుల్లో 162 మంది నిరసనకారులు ఉండగా, 41 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌లో గత కొద్దిరోజులగా ఇరాన్ లో జరగుతున్న నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడం, జీవన వ్యయాలు పెరగడం వంటి సమస్యలతో డిసెంబర్ 28 నుంచి ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు స్పందించారు. ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం వాస్తవమేనన్నారు. అయితే తాము నిరసనకారులతో మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. కానీ, అంతకంటే ముఖ్యమైన పని మరొకటుందని, అదేంటంటే కొంతమంది అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయకుండా చూస్తున్నారని మీడియాతో చెప్పారు.
ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ఇరాన్ ప్రభుత్వం ఇదివరకే నిలిపివేసింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియడం కష్టతరమైంది. మరోవైపు, నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొంటే దేవుని శత్రువుగా భావిస్తామని, మరణిశిక్ష విధించే నేరంగా పరిగణిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ ఇదివరకే హెచ్చరించారు. అటార్నీ జనరల్ చేసిన హెచ్చరికను ఇరాన్ ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, నిరసనకారులపై కాల్పులు జరిగితే అమెరికా జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, నిరసనకారులు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో జరిగినట్లే ప్రజలను చంపడం మొదలుపెడితే మేం జోక్యం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇరాన్ కాల్పులు జరిపితే, తాము కూడా కాల్చాల్సి వస్తుందని అన్నారు. మా సైనికులు మీ గడ్డపైకి దిగకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎక్కడ కొడితే నొప్పి తెలుస్తుందో మాకు బాగా తెలుసని ట్రంప్ చెప్పారు. అత్యంత కఠినంగా మిమ్మల్ని దెబ్బకొడతాం గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన వేళ అక్కడి పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. భారతీయులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేస్తోంది. విద్యుత్ సరఫరా, విమాన సర్వీసులను నిలిపివేసిన నేపథ్యంలో భారతీయులను తరలించేందుకు ఉన్న అవకాశాలపై కేంద్రం ఇప్పటికే పని మొదలుపెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. ఇరాన్‌లోని 31 ప్రావిన్స్‌ల పరిధిలోని 180 నగరాలకు ఆందోళనలు వ్యాపించాయని అందులో దాదాపు 11లక్షల మంది ప్రజలు పాల్గొంటున్నారని పేర్కొన్నాయి. రాజధాని టెహ్రాన్, ఇరాన్ రెండో పెద్ద నగరం మషహద్‌లో ఇవాళ కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. 2 వారాలుదాటిన నిరసనల్లో ఇప్పటివరకు 203మందికిపైగా మృతిచెందినట్లు ఆందోళనకారులు తెలిపారు. 2వేల 6వందల మందిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికాకు చెందిన ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇంటర్నెట్, ఫోన్‌లైన్లను నిలిపివేయటం వల్ల విదేశాల నుంచి పరిస్థితులను అంచనా వేయటం కష్టంగా మారినట్లు పేర్కొంది.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









