Iran - Israel War: ముఖ్యంగా అమెరికా.. ఇజ్రాయిల్ ను అడ్డం పెట్టుకొని ఇరాన్ ను దెబ్బ తీస్తోందనేది ఇరాన వర్గాలు చెబుతున్నాయి. అమెరికార మాత్రం ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసే యోచనలో ఉన్నట్టు కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొంత మంది విలేకరులు అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చేందుకు ట్రంప్ నిరాకరించారు. అయితే, టెహ్రాన్ హద్దులు దాటిందని, దీనిపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. వచ్చేవారం చాలా కీలక పరిణామం చోటుచేసుకోవచ్చని, అంతలోపే జరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో తాను జోక్యం చేసుకుంటానో లేదో తెలియదన్నారు ట్రంప్. నేనేం చేయనున్నానో ఎవరికీ తెలియదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో చర్చలు జరిపేందుకు ఇరాన్ ప్రతిపాదన చేసిందని చెప్పిన ఆయన.. ఎప్పుడు, ఏవిధంగా అనే విషయాలను వెల్లడించలేదు. అయితే, టెహ్రాన్ ప్రస్తుతం తననుతాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉందని, గగనతల రక్షణ వ్యవస్థలు కూడా లేవని ట్రంప్ అన్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతుండటంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను విడిచిపెట్టి అర్మేనియా సరిహద్దుకు చేరుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన విమానం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 90 మంది కశ్మీర్‌కు చెందిన విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా పాకిస్థాన్, అఫ్ఠనిస్తాన్ గగన తలం నుంచి కాకుండా.. అర్మేనియా నుంచి భారత విద్యార్థులను మన దేశానికి ఎయిర్ లిఫ్ట్ చేసింది. మరోవైపు ఇరాన్ లో వివిధ పనుల నిమిత్తం వెళ్లిన విద్యార్ధులు, ఉద్యోగులు, పర్యాటకులను కూడా విడతల వారీగా తరలించే ప్రక్రియ భారత్ చేపట్టింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్, ఇటు ఇజ్రాయిల్ తో భారత్ చర్చలు జరిపింది. భారతీయులను తరలించే మార్గంలో రెండు దేశాలు యుద్ధ విరామాన్ని పాటించేలా చేయడంలో భారత్ దౌత్యం పనిచేసింది.
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









