అన్నా బ‌ర్న్స్‌కు 'మ్యాన్ బుకర్ ప్రైజ్‌'

అన్నా బ‌ర్న్స్‌కు 'మ్యాన్ బుకర్ ప్రైజ్‌'

Updated: Oct 17, 2018, 11:03 AM IST
అన్నా బ‌ర్న్స్‌కు 'మ్యాన్ బుకర్ ప్రైజ్‌'

లండన్: 2018 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మక 'మాన్ బుకర్ ప్రైజ్' కు ఉత్తర ఐరిష్ రచయిత అన్నా బ‌ర్న్స్ ఎన్నికయ్యారు. ఆమె రాసిన 'మిల్క్‌మ్యాన్' న‌వ‌ల‌కు ఈ అవార్డు ద‌క్కినట్లు బుకర్ ప్రైజ్ కమిటీ ప్రకటించింది. ఉత్తర ఐర్లాండ్‌లో క్యాథ‌లిక్కులు, ప్రొటెస్టాన్ల మ‌ధ్య హింస చోటుచేసుకున్న సంద‌ర్భంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ర్న్స్ త‌న న‌వ‌ల‌లో చిత్రీక‌రించారు.

లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లా నుండి 'మాన్ బుకర్ ప్రైజ్' ను బ‌ర్న్స్  అందుకున్నారు. అవార్డుతో పాటు విజేత రూ.41.5 లక్షల(50 వేల పౌండ్ల) మొత్తాన్ని బహుమతిగా అందుకున్నారు. అవార్డుకు ఎంపిక కావడంపట్ల అన్నా బ‌ర్న్స్ సంతోషం వ్యక్తం చేశారు. బుకర్ అవార్డు గెలవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిన‌ట్లు ఆమె చెప్పారు. కాగా మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలిచినా తిలి ఉత్తర ఐరిష్ రచయిత అన్నా బ‌ర్న్స్ కావడం విశేషం.

మాన్ బుకర్ బహుమతి (Man Booker Prize) లేదా బుకర్ బహుమతి (Booker Prize) ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు మరియు జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం. 1969 నుంచి ప్రతిఏటా బుకర్ బహుమతుల ప్రదానం జరుగుతోంది. బూక‌ర్ ప్రైజ్ కోసం ఆంగ్ల ర‌చ‌యిత‌లు పోటీప‌డుతారు. బుకర్ ప్రైజ్ విజేతను ఏటా అక్టోబర్ 17న ప్రకటిస్తుంది.