Israel bomb attack on iran state tv studio video: ఇజ్రాయేల్, ఇరాన్ ల మధ్య యుద్దం తారాస్థాయికి చేరింది. ఇరు దేశాలు సైతం మిసైల్, బాంబులు, డ్రొన్ లతో ఒకరిపై మరోకరు విరుచుకు పడుతున్నారు. దీంతో పశ్చిమాసియాలో పూర్తిగా కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇజ్రాయేల్.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట.. ఇరాన్ పై దాడులకు దిగింది. తాము ఇరాన్ అణు ప్రయోగాలనుంచి ప్రపంచాన్ని మొత్తంగా కాపాడటానికి యుద్దం చేస్తున్నట్లు ఇజ్రాయేల్ చెప్పుకొచ్చింది.
Footage showing strikes moments ago by the Israeli Air Force on the studios and offices of the Iranian state-run broadcaster IRIB in Tehran. pic.twitter.com/V5sBiyEM6p
— OSINTdefender (@sentdefender) June 16, 2025
ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు శుధ్ధికేంద్రాలు, అణు పరిశోధనల కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయేల్ ముప్పెట దాడుల్ని నిర్వహిస్తుంది. మరోవైపు ఇరాన్.. అమెరికా వార్నింగ్ ఇస్తున్న కూడా డోంట్ కేర్.. దేనీకైన రెడీ అన్న విధంగా కదనరంగంలో ఇజ్రాయేల్ పై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో తాజాగా.. ఇరాన్ ప్రభుత్వ వార్తా ప్రసార సంస్థకు చెందిన ఒక స్టూడియోపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిగింది.
ఇరాన్ లో.. టీవీ స్టూడియోలో యుద్దంపై లైవ్ లో వార్తలు నడుస్తున్నాయి. దీంతో లేడీ యాంకర్ యుద్దంపై ఆవేశంగా వార్తలు చదువుతుంది. ఇంతలో ఒక్కసారిగా ఒక మిసైల్ వచ్చి.. టీవీ స్టూడియోపై పడింది.
Read more: Trump on Israel iran War: మేం రంగంలోకి దిగితే వార్ వన్ సైడే.. ! .. ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్...
దీంతో పైనుంచి శిథిలాలు కింద పడుతున్నాయి.లైవ్ లోనే యాంకర్ ప్రాణ భయంతో గజ గజ వణికిపోయి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. ఆ సమయంలో.. కొంతమంది అక్కడున్న సిబ్బంది.. "అల్లా-హు-అక్బర్" అనే నినాదాలు వినిపించాయి.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook