Israel - Gaza War: గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు..

Israel - Gaza War: అమెరికాలో తాను అధ్యక్షుడు అయ్యాకా .. ప్రపంచంలో యుద్దమనేదే లేకుండా చేస్తానని చెప్పిన ట్రంప్.. అందుకు తగ్గట్టు.. రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికే ప్రయత్నంలో ఉన్నాడు. అంతకు ముందే..ఇజ్రాయిల్, గాజా మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్దానికి ముగింపు పలికారు. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ జరిగింది. కానీ తాజాగా ఇజ్రాయిల్ .. గాజాపై దాడులకు తెగపడటంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2025, 11:36 AM IST
Israel - Gaza War: గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు..

Israel - Gaza War: ఇజ్రాయెల్‌- గాజాలోని హమాస్‌ ల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాజాపై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 130 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. సంధి చర్చలు నిలిచిపోయిన టైంలో గాజాలోని హమాస్‌ లక్ష్యంగా ఐడీఎఫ్‌, ఐఎస్‌ఏ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్‌ పేర్కొంది. అనంతరం ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు తెలిపారు. తమ బందీలను విడుదల చేయడాన్ని హమాస్‌ పదేపదే నిరాకరిస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించిందన్నారు. ఈనేపథ్యంలోనే దాడులకు ఆదేశించినట్లు ప్రకటించారు. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ (ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్) దాడులు చేస్తోందని... ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటినుంచి హమాస్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

మరోవైపు ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే హమాస్ కీలక ప్రకటన చేసింది. ఈ తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తమ కాల్పుల విరమణను ఉల్లంఘించి బందీలను ప్రమాదంలో పడేశారని పేర్కొంది. దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది.

అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఈ టైంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంగీకరించలేదు. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాల్పుల విరమణ ముగియడంతో ఇజ్రాయెల్ దళాలు… హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 130 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు దక్షిణ సిరియాపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 19 మంది గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దక్షిణ సిరియాలోని మిలటరీ కమాండ్ సెంటర్ లు, ఆయుధాలు, ఆర్మీ వాహనాలు ఉన్న స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేస్తోంది. సిరియాను అసద్ పాలిస్తున్నప్పుడు ఈ స్థావరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మిలిటరీ ఆస్తులను సిరియా నూతన ప్రభుత్వ వర్గాల ఆధ్వర్యంలోని బలగాలు నిర్వహిస్తున్నాయి. వీటి నుంచి ఇప్పుడు తమకు ప్రమాదం పొంచి ఉందనే కారణంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News