Trump on Israel iran War: మేం రంగంలోకి దిగితే వార్ వన్ సైడే.. ! .. ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్...

Trump mass warning to Iran: ఇజ్రాయేల్, ఇరాన్ ల మధ్య వార్ తారాస్థాయికి చేరింది.ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో తాము రంగంలోకి దిగితే యుద్దం పరిణామం పూర్తిగా మారిపోతుందని హెచ్చరించారు. 

Last Updated : Jun 15, 2025, 02:47 PM IST
  • భీకరంగా మారిన ఇజ్రాయేల్, ఇరాన్ దాడులు..
  • సీరియస్ అయిన అమెరికా..
Trump on Israel iran War: మేం రంగంలోకి దిగితే వార్ వన్ సైడే.. ! .. ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్...

Donald trump big warning to iran: ఇరాన్ , ఇజ్రాయేల్ దేశాల మధ్య యుద్దం పీక్స్ కు చేరింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయేల్ భీకర దాడుల్ని చేస్తుంది.  ఈ క్రమంలో రెండు దేశాలు కూడా క్షిపణులు, ఫైటర్ జెట్ లు, డ్రోన్ లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయేల్ బెదిరింపులకు..  ఏమాత్రం తలొగ్గని ఇరాన్ కూడా.. గట్టిగానే పోరాటం చేస్తుంది.

ఈ క్రమంలో ఇప్పటికే ఇరాన్ పలు అగ్రదేశాలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ లు.. ఇజ్రాయేల్ కు మద్దతుగా రంగంలోకి దిగితే.. తీవ్ర పరిణామాలుంటాయని, ఆ దేశం సైనికస్థావరాలు, మిలటరీ బలగాలను టార్గెట్ చేయాల్సి వస్తుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈక్రమంలో రెండు దేశాల మధ్య భీకరమైన దాడులతో మిడిల్ ఈస్ట్ లో పెనువిధ్వంసం నడుస్తొంది. 

మరోవైపు ఇరాన్  అణ్వాయుధ కేంద్రాలపై ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేస్తుంది. ఇరాన్ సైతం.. ఇజ్రాయేల్ రాజధానిపై దాడులకు తెగబడింది. దీంతో పశ్చిమాసియాలో కల్లోలం వల్ల మూడో ప్రపంచ యుద్దం వస్తుంద అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ భీకర దాడులు తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ..   ఒక వేళ తాము యుద్దంలో దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని ఇరాన్ కు హెచ్చరికలు జారీచేశారు.  ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడే దుస్సాహాసమే చేస్తే.. చరిత్ర పుటల్లో కనివినీ ఎరుగని రీతిలో ఇరాన్ పై విరుచుకుపడతామని డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఇరాన్ తమను ఏ విధంగా దాడులు చేయడానికి సాహాసం చేసిన కూడా.. అన్నిరకాలుగా ఎదుర్కొని అమెరికా సాయుధ దళాల సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా అయితే ట్రూత్ లో పోస్ట్ చేశారు. 

Read more: Donald Trump: ఇజ్రాయెల్ దాడి సరైందే.. ఇరాన్‌కు ఆ గతి పట్టాల్సిందే : డొనాల్డ్‌ ట్రంప్..

ఈ ఘటన ప్రపంచ దేశాల్ని మరింత కలవరపెట్టేదిగా మారింది. అదే విధంగా..  ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాను సులభంగా ఒక ఒప్పందం కుదిర్చి, ఈ యుద్దంకు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం నెలకొన్న యుద్దం పరిస్థితుల వల్ల.. ప్రధాని నేతన్యాహు.. తన కుమారుడి పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నట్లు ఆ దేశంలోని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News