Israel Iran War Video: ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఒకానొక లెక్క ప్రకారం మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా అని ప్రపంచ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయిల్ నిన్న శుక్రవారం ఉదయం నుంచి ఇరాన్ పై భీకరంగా డ్రోన్, బాంబుల దాడులు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ అణు స్థావరాలు, కొంత మంది శాస్త్రవేత్తలు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే తాజాగా ఇరాన్ లోని ఎయిర్‌పోర్ట్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ న్యూస్ ఏజెన్సీ డాన్సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇరాన్ ఎయిర్‌పోర్ట్ సివిల్, ఏవియేషన్‌కు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ టార్గెట్ చేసి పేల్చివేసింది.
ఇక ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య మిస్సైల్ దాడులతో మిడిల్‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచం యుద్ధం మొదలైంది అని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరు దేశాల యుద్ధం వాణిజ్యపరంగా కూడా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధానంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
Israel is bombing Tehran airport, where Khamenei's plane is also located.pic.twitter.com/TM8k6obs6Q
— Vivid.?? (@VividProwess) June 13, 2025
ఇరాన్ కు భారీ దెబ్బ..
ఇరాన్ పై దాడులకు ఇజ్రాయిల్ గూఢచార్య విభాగం మొసద్ కొన్నేళ్లుగా వ్యూహం రచించింది. కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించి ఇరాన్ కి రహస్యంగా కమాండోలను, పేలుడు పదార్థాలను తీసుకెళ్లింది. సమీపంలో డ్రోన్ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇక ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుకాగానే అక్కడి నుంచి ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసి పేల్చేసింది. ఈ దాడితో ఇరాన్ కి భారీ నష్టమే వాటిల్లింది.
ఇరాన్ ప్రతీకార దాడులు..
ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతీకర దాడులకు దిగింది.ఈ నేపథ్యంలో ఐడిఎఫ్ హెడ్ క్వార్టర్స్ పై దాడులో విరుచుకుపడింది. రాజధానిలో టెల్ అవివ్ లక్ష్యంగా చేసుకొని మిస్సైల్ దాడి చేయగా.. మొసద్ మాత్రం ఎలాంటి దాడి తమపై జరగలేదని చెబుతోంది. 150 కి పైగా మిస్సైల్ లాంచ్ చేసింది ఇరాన్ ఈ దాడిలో 17 మంది ఇజ్రాయిల్ ప్రజలు గాయపడ్డారు.
ఇజ్రాయెల్ యుద్ధం కోరుకుంటుంది: సుప్రీం లీడర్
ఇజ్రాయెల్ యుద్ధమే కోరుకుంటుంది. దీనికి పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని తీవ్రంగా హెచ్చరించారు. ఇక తాము జరిపేది దాడులు కావని.. యుద్ధమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ అస్సలు సుఖంగా ఉండనీయమని చాలా తక్కువగా అంచనా వేయొద్దని ఖమేని అన్నారు.
Also Read : Video: ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులతో ఇరాన్‌కు చావుదెబ్బ.. ఆర్మీ కీలక నేతలు మృతి..
Also Read :భారత్‌కు ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధం.. ఎయిర్ ఇండియా ఘటనపై ట్రంప్ విచారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









