Jaffar Express Hijack: పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్.. మిలిటెంట్ల చెరలో 400 మంది ప్రాణాలు

Jaffar Express Hijacked In Pakistan: పాకిస్థాన్‌లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న ఉద్యమకారులు హైజాక్‌ చేశారు. దీంతో 400 మంది ప్రాణాలు వారి చెరలో చిక్కుకున్నాయి. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 11, 2025, 05:22 PM IST
Jaffar Express Hijack: పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్.. మిలిటెంట్ల చెరలో 400 మంది ప్రాణాలు

Pakistan Train Hijack: సినిమాల్లో చూసినట్టుగా అచ్చం అలాంటి సంఘటనే పాకిస్థాన్‌లో చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పట్టాలపై ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న కొందరు హైజాక్‌ చేశారు. బహిరంగంగా తుపాకీ కాల్పులు చేసి రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికులను బయటకు పంపకుండా రైలును తమ నియంత్రణలోకి పెట్టుకున్నారు. పట్టాలు పేల్చి ప్రయాణికులను బందీలుగా తీసుకోవడంతో పాకిస్థాన్‌లో తీవ్ర భయాందోళన ఏర్పడింది. వారి చేతిలో 400 మంది ప్రయాణికుల ప్రాణాలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: UAE Death Penalty: యూఏఈలో పెరుగుతున్న మరణశిక్షలు, మరో ఇద్దరు ఇండియన్స్‌కు శిక్ష

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ ప్రత్యేక దేశం కావాలని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తోంది. వేర్పాటువాదుల ఆందోళనతో పాకిస్థాన్‌ అట్టుడుకుతుండగా.. తమ ఉద్యమంలో భాగంగా మంగళవారం రైలును హైజాక్‌ చేశారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బయల్దేరింది. పెషావర్‌ వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్‌ ఆర్మీ హైజాక్‌ చేసింది. పెద్ద ఎత్తున కాల్పులు చేయడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.

Also Read: US TAX ON INDIA: భారత్ కు బిగ్ షాక్ ఇచ్చి డొనాల్డ్ ట్రంప్.. ఇకపై బాదుడే బాదుడు..

బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా చేయాలని బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) డిమాండ్‌ చేస్తోంది. ప్రయాణికులతోపాటు పోలీస్‌ సిబ్బంది కూడా మిలిటెంట్ల చేతిలో బందీలుగా ఉన్నారు. రైలును హైజాక్‌ చేసే సమయంలో జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. పాకిస్థాన్‌ సైన్యం ఎలాంటి ఆపరేషన్‌కు ప్రయత్నించినా ప్రయాణికులందరినీ చంపేస్తామని బీఎల్‌ఏ హెచ్చరించింది.

రైలు హైజాక్‌ వార్త పాకిస్థాన్‌లో సంచలనం రేపగా.. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. మిలిటెంట్ల చేతిలో చిక్కుకున్న ప్రయాణికులను విడిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దేశ అత్యున్నత భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. దేశంలోని అన్ని భద్రతా వ్యవస్థలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని పాకిస్థాన్‌ మీడియా వెల్లడిస్తోంది. రైలు హైజాక్‌పై ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా విడుదల చేయించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News