Japan: అక్కడ వారంలో 36 గంటలు శృంగార సెలవు, నమ్మలేకున్నారా నిజమే

Japan: ప్రపంచ దేశాల్లో జపాన్ తీరే ప్రత్యేకం. అక్కడ సమయానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. సంపాదనపై ఉన్న ఆసక్తి ఇతర వ్యవహారాలపై ఉండదు. అందుకే ఆ దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2025, 07:56 PM IST
Japan: అక్కడ వారంలో 36 గంటలు శృంగార సెలవు, నమ్మలేకున్నారా నిజమే

Japan: ఇతర దేశాల్లో యువతకు జపాన్ యువతకు చాలా తేడా ఉంటుంది. పని ఒత్తిడి కావచ్చు లేదా ఆర్ధిక అస్థిరత వంటి కారణాలతో పెళ్లి, శృంగారంపై ఆసక్తి ఉండటం లేదు. ఇంకొందరికి ఆసక్తి ఉన్నా సమయం చాలడం లేదు. టైమ్ లేదనే కారణంతో శృంగారానికి దూరంగా ఉంటున్న ప్రజలు ఈ దేశంలోనే కన్పిస్తారు బహుశా. 

Add Zee News as a Preferred Source

అందుకే జపాన్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పెళ్లయిన దంపతులు శృంగారంలో పాల్గొనేందుకు వీలుగా వారంలో 36 గంటలు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లల్ని కనేందుకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వనున్నారు. సమయంతో పాటు మారుతున్న కల్చర్, మారుతున్న ప్రాధాన్యతల వల్ల కూడా జననాల రేటు తగ్గిపోతోందని గమనించారు. అంతకంటే శోచనీయం ఏంటంటే కనీసం తల్దిదండ్రులయ్యేందుకే భయపడిపోతున్నారట. అందుకే దేశ ప్రజల్లో, యువతలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రైవసీ కల్పించేందుకు యోచిస్తోంది.

వారంలో 5 రోజులు కాకుండా నాలుగు రోజుల పనిదినాలుండి 36 గంటలు విశ్రాంతి ఇస్తే చాలా వరకు సహాయపడవచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పుడైతే దంపతులకు ప్రైవసీ ఉంటుందో అప్పుడు శృంగారంలో పాల్గొనే ఆసక్తి రావచ్చని అభిప్రాయపడుతున్నారు. జపాన్ దేశం దశాబ్దాలుగా తగ్గుతున్న జనాభా రేటుతో పోరాడుతోంది. ఓ అధ్యయనం ప్రకారం ఇప్పటికే 9 మిలియన్ల ఇళ్లు జనం లేక ఖాళీ అయ్యాయి. దేశంలో బర్త్ రేట్ పెంచేందుకు వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తోంది. వారంలో నాలుగు రోజులు పని మిగిలిన మూడు రోజులు శృంగారం కోసం కేటాయిస్తోంది. 

జననాల రేటు తగ్గడం వృద్ధాప్య రేటు పెరగడం జపాన్ దేశంలో ప్రధాన సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా జపాన్ ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు, పిల్లల సంరక్షణకు సబ్సిడీ, పెళ్లి చేసుకుంటే కానుకలు వంటివి ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తాజాగా క్రిటికల్ వర్కింగ్ కల్చర్ తగ్గించే ఆలోచన చేసింది. అందుకే ఇకపై ఈ దేశంలో వారం 36 గంటల సెలవు కేవలం శృంగారం కోసం ఇవ్వనున్నారు. 

Also read: Free Gas Cylinder Scheme: గుడ్‌న్యూస్, ఇక రెండో ఫ్రీ గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News