Video: తైవాన్ అథ్లెటిక్స్‌లో తెలుగు తేజం.. దాటుకుంటూ వచ్చి రెప్పపాటులో గోల్డ్ కొట్టిన జ్యోతి యర్రాజీ వీడియో..

Jyothi Yarraji Taiwan Oympics Video: తైవాన్ అథ్లెటిక్స్‌లో తెలుగు తేజం మెరిసింది. 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్ ను ఆమె 12.99 సెకండ్లతో పూర్తి చేసి.. బంగారు పతకం కైవసం చేసుకుంది జ్యోతి యర్రాజీ. మరోసారి తైవాన్‌ ఓపెన్స్‌ 2025లో గోల్డ్ మెడల్ కొల్లగొట్టి తన సత్తా చాటింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 7, 2025, 06:55 PM IST
Video: తైవాన్ అథ్లెటిక్స్‌లో తెలుగు తేజం.. దాటుకుంటూ వచ్చి రెప్పపాటులో గోల్డ్ కొట్టిన జ్యోతి యర్రాజీ వీడియో..

Jyothi Yarraji Taiwan Oympics Video: అదరగొట్టిన తెలుగు తేజం.. మరోసారి సత్తా చాటిన జ్యోతి ఎర్రాజీ. ఈరోజు జరిగిన తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2025లో గోల్డ్ మెడల్‌ కొల్లగొట్టింది. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ ను ఆమె 12.99 సెకండ్లతో పూర్తి చేసి భారత్‌కు బంగారు పథకాన్ని అందించింది. మొదటి రెండు హర్డిల్స్‌ వరకు వెనుకంజలో ఉన్న జ్యోతి రెప్పపాటులో అందరినీ దాటుకుంటూ వచ్చి విజేతగా నిలిచారు.  తైవాన్ ఓపెన్ 2025 చాలా రసవత్తరంగా సాగింది. చివరి నిమిషంలో జ్యోతి యర్రాజీ అందరినీ దాటుకుంటూ వచ్చి ఒక్కసారిగా ముందుకు వచ్చి.. భారత్ కు బంగారు పథకాన్ని తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Add Zee News as a Preferred Source

ఇక జపనీస్ రన్నరప్‌ అసుక తెరాడే (13.4) సెకండ్లు. కిస్ ఆటో కియో (13.10) సెకండ్ల తేడాతో సిల్వర్, బ్రాంజ్‌ సంపాదించుకున్నారు. ఇక తైవాన్‌ ఓపెన్‌ 2025 వేడుకలు తైపీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. జ్యోతి యర్రాజీ కొరియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో కూడా గోల్డ్ మెడల్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆమె (12.96) సెకండ్లలో గోల్డ్‌ మెడల్ కొట్టేసి సత్తా చూపించింది.జ్యోతి యర్రాజీ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అథ్లెట్. మన దేశానికే గర్వకారణంగా నిలిచింది. జ్యోతి 2000 సంవత్సరంలో నవంబర్ 28న ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించింది. చిన్నతనం నుంచే క్రీడల్లో ఆసక్తి కనబరిచింది. స్కూల్లో ఉన్నప్పుడు నుంచి ఆమె పరుగు ప్రారంభించింది. ఇక చదువుకుంటూనే తన క్రీడా కెరీర్ ప్రారంభించింది. జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌లో ప్రావీణ్యత పొందింది. ఇదే ఏడాది సౌత్ కొరియా వేదికగా జరిగిన ఆసియా అథ్లెటెక్స్ ఛాంపియన్‌షిప్లో జ్యోతి ( 12.96) సెకండ్లలో గోల్డ్ కొట్టేసింది. కేరళలో కూడా తన సత్తా చూపించింది మరో బంగారు పతకం సాధించింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు జ్యోతి యర్రాజీకి వెల్లువెత్తాయి. ఈ రేస్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక పురుషుల 110 మీటర్స్ హర్డిల్స్‌ రేస్ లో తేజస్ శీర్సే (13.52) సెకండ్ లో పసిడి పథకాన్ని సొంతం చేసుకున్నారు. అబ్దుల్ అబూబకర్ (16.21) పూజ మరో గోల్డ్ మెడల్ మొత్తంగా భారత్‌కు 4 బంగారు పథకాలు సాధించారు.

 

 

Also Read:   భారత్ లేకుండా G7 సమ్మిట్ ఎలా నిర్వహిస్తామన్న కెనడా PM.. మోదీ ఏమన్నారో తెలుసా?

Also Read:  రాత్రి పడుకునే ముందు జుట్టుకు ఈ నూనె రాస్తే చాలు కుదుళ్ల నుంచి నల్లగా మారిపోతుంది..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News