Khalistani extremists try to attack on s Jaishankar: భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ యూకే పర్యటనలో ఉన్నారు. మార్చి 4న యూకేకు వెళ్లిన ఆయన 9వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు.ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య అనేక అంశాలలో చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే లండన్ విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్ భేటీ అయ్యారు.
ముఖ్యంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం, వ్యూహత్మక ఒప్పందాలు, విద్య, రాజకీయ అంశాల విషయాలలో పరస్పరం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతే కాకుండా.. ఇటీవల ప్రపంచంలో భారత్ వృద్ధి, పాత్ర అనే అంశంపై కూడా జై శంకర్ లండన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అయితే.. లండర్ లో తాజాగా.. జైశంకర్ ఛారమ్ హౌస్ లో తన సమావేశంను ముగించుకుని బైటకు వస్తున్నారు.
Khalistani elements attempt to heckle India's External Affairs Minister S Jaishankar while he was leaving in a car after attending an event in London, England.
The National flag of India was desecrated.
The Govt of India must revoke the PIO/OCI cards of anti-India elements. pic.twitter.com/ogNjVkIpB6
— Anshul Saxena (@AskAnshul) March 6, 2025
ఇంతలో కొంత మంది ఖలీస్థానీ మద్దతు దారులు భారీగా అక్కడికి వచ్చి నినాదాలు చేశారు.అంతే కాకుండా.. భారత్ పతాకంను చేతిలో పట్టుకుని అవమానంచేలా ప్రవర్తించారు. జైశంకర్ కూర్చున్న కారుపై దాడికి సైతం యత్నించారు.
Read more: Trump- Zelensky: ట్రంప్‌తో వాగ్వాదం విచారకరం.. సాయం నిలిపివేతతో దిగొచ్చిన జెలెన్‌స్కీ..
దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన లండన్ పోలీసులు ఖలీస్థానీ సానుభూతి నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జైశంకర్ సైతం.. ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









