Lashkar-e-Taiba Warning To Prime Minister Narendra Modi: పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలు మరోసారి బరి తెగించాయి. అక్కడ ప్రభుత్వంతో పాటు సైనికుల కనుసన్నల్లో పనిచేసే ఉగ్రవాద సంస్థలు మరోసారి భారత్ ను లక్ష్యాన్ని చేసుకున్నాయి. మరోసారి ఆ దేశంలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ భారత ప్రధాని నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇచ్చింది. పహల్గామ్ తరహాలో మరో దాడికి పాల్పడతామంటూ లష్కరే డిప్యూటీ చీఫ్, పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి బహిరంగంగా హెచ్చరించారు.
భారత్ వాటర్ టెర్రరిజమ్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసి పాక్‌లో వరదలు వచ్చేలా చేస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఎటాక్ లాగా ప్రధాని మోడీకి మరో పాఠం చెప్పాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌ను కోరుతున్నట్లు ఓ సభలో చెప్పుకొచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని ..పాకిస్థాన్ తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాటు ఆ దేశంలో ఏ రకమైన వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మర్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించి వందలాది ఉగ్రవాదులను మట్టు పెట్టింది. అంతేకాదు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు సహా పలు అంశాలపై అంతర్జాతీయ వేదికలపై ఆ దేశాన్ని తూర్పారా పట్టింది. మరోవైపు ఇంత చేస్తోన్న అగ్ర రాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికా తన సైనిక అవసరాల కోసం పాకిస్థాన్ కు మద్దతుగా నిలబడతూ వస్తోన్న సంగతి తెలిసిందే కదా.
Read more: విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. షాక్ కు గురి చేస్తోన్న న్యూస్..
Read more: ఒకే టైటిల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హిట్స్ అందుకుంటే.. చిరు డిజాస్టర్ అందుకున్నాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









