)
Charlie Kirk Shooting Video: అమెరికా పొలిటికల్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. ఉటా వర్శిటీలో దుండగుల కాల్పుల్లో గాయపడిన డోనాల్డ్ ట్రంప్ సన్నీహితుడు మృతి చెందాడు. అమెరికా యువత మనసుల్ని చార్లీ కంటే ఎవరు బాగా అర్థం చేసుకోలేదు.. అతడిని నాతోపాటు అందరూ అభిమానించారు. ఇప్పుడు అతడు మనతో లేడు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పోస్ట్ చేశాడు. చార్లీ కుటుంబానికి ఆయన సంతాపం తెలియజేశారు. అయితే చార్లీ కిర్క్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో 'టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ' అనే కన్జర్వేటివ్ యూత్ గ్రూప్స్ సీఈవో చార్లీ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆ సందర్భంలోనే అతన్ని కాల్చి చంపేశారు.
మొదట్లో కాల్పులు జరిపిన వెంటనే అతని పరిస్థితి విషమించింది అని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో చార్లీ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించారు. ఆ తర్వాత ఆయన మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సన్నిహితుడు మృతికి సంతాపం తెలియజేశారు. అయితే ప్రధానంగా తిరిగి విశ్వవిద్యాలయంలో ఉండటాన్ని చాలామంది నిరసన తెలిపినట్లు సమాచారం. ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించకూడదని డిమాండ్ చేశారు. కానీ కొన్ని విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేదు వాక్ స్వేచ్ఛ సంబంధించిన విషయం అంటూ ఆన్లైన్ లో 1000 మంది సంతకాలు తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
#Breaking *GRAPHIC* #CharlieKirk Shooting Video
— Dan Thom,B.S.,J.D.⚖️⚖️⚖️ ??? (@WB6DYN) September 10, 2025
ట్రంప్ పోస్ట్ వైరల్..
చార్లీ కిర్క్ మరణానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ట్రంప్.. గొప్ప వ్యక్తి చార్లీ కిర్క్ ఈ ప్రపంచంలో లేరు అమెరికా యువతను చార్లీ కంటే ఎక్కువగా అర్థం చేసుకునే వారే లేరు. నాకు ఎంతో గౌరవం.. ప్రేమ ప్రస్తుతం మన మధ్య లేరు. నేను మెలానియా ఆయన భార్య ఎరికా కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నామని పోస్ట్ చేశారు ట్రంప్.
ఇక కిర్క్ 18 ఏళ్ల వయసుకే 'టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ' ఆర్గనైజేషన్ స్థాపించారు. అయితే యూనివర్సిటీ ప్రసంగంలో ఆయన మాట్లాడుతుండగా దుండగులు కాల్చి చంపారు. చాలా మంది వ్యతిరేకించినా బలవంతంగా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కిర్క్ కాల్చివేత వీడియో సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో నేరుగా అతని మెడ భాగంలో బుల్లెట్ తగిలింది అది వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. కాల్పులు జరిపిన వెంటనే కిర్క్ కూడా కుప్పకూలిపోతాడు. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నవాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కిర్క్ మరణానికి సంతాపంగా ఈరోజు అమెరికా జాతీయ జెండాను కూడా అనవతం చేయాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.