Massive Earth Quake Video: భారీ భూకంపం.. బ్యాంకాక్, మయన్మార్‌లలో పేకమెడల్లా కూలిన భవనాలు, వంతెనలు..  వీడియో..

Earth quake in myanmar: మయాన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. భవనాలు, మెట్రోలు, వంతెనలు పేకమేడల్లో వణికిపోయాయి.ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 28, 2025, 02:23 PM IST
  • మయన్మార్, థాయ్ లాండ్ లో భూకంపం..
  • వీడియో వైరల్..
Massive Earth Quake Video: భారీ భూకంపం.. బ్యాంకాక్, మయన్మార్‌లలో  పేకమెడల్లా కూలిన భవనాలు, వంతెనలు..  వీడియో..

Massive Earthquake hits myanmar and Thailand Video: మయన్మార్, థాయ్ లాండ్ లో భారీ భూకంపం సంభవించింది. దీంతో అప్పటి వరకు తమ పనుల్లో ఉన్న జనాలంతా ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. భవనాలు, వంతెనలు, మెట్రోలు పేకమేడల్లా వణికిపోయాయి. జనాలు ఇళ్ల నుంచి బైటకు వెళ్లిపోయారు.. రిక్టర్ స్కెల్ మీద  మయన్మార్ లో 7.7 తీవ్రతతో, థాయిలాండ్లో 7.3 తీవ్రతతో భూంకంపం సంభవించింది. అయితే.. భూకంప ప్రభావం వల్ల... ప్రధాని షినవత్ర థాయ్ లాండ్ లో అత్యవసర పరిస్థితిని విధించింది.

Add Zee News as a Preferred Source

 

భూకంప ప్రభావం మనదేశంలోని కోల్ కతా, ఇంఫాల్, మేఘాలయాపై కూడా పడింది. ప్రస్తుతం సంభంచిన భూకంపం వల్ల భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. భూకంపం తీవ్రతకు భవనాలు  ఒక్కసారిగా వణికిపోయి.. చూస్తుండగా పేకమేడల్లా కూలిపోయాయి. మెట్రోలో ట్రైన్ లు సైతం ఊగిపోయాయి. 

 

భూకంపం ధాటికి మండాలేలోని చారిత్రక అవా బ్రిడ్జ్ కూడా చూస్తుండగానే కుప్పకూలింది. మయన్మార్ వాయువ్య ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతాల నుంచి ప్రజల్ని ఇతర ప్రాంతాలకు అధికారులు పంపించి వేస్తున్నారు.

Read more: Samantha Video: వామ్మో.. నగ్నంగా మారి రచ్చ చేసిన సమంత..?.. బిగ్ షాక్‌లో అభిమానులు.. వీడియో వైరల్..

భూకంపం సంభవించిన మయన్మార్, థాయ్ లాండ్ కు చుట్టుపక్కల ఉన్న దేశాలు సైతం ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతం భూకంపం సంభవించినప్పుడు భవంతులు,వంతెనలు పేకమెడల్లా కూలిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News