)
Philippines Earthquake Video: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం నిన్న రాత్రి సంభవించింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో 60 మందికి పైగా మృతి చెందారు. వందల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు రిక్టార్ స్కేల్ పై 6.9 తీవ్రతతో నమోదయిందని ప్రభుత్వం తెలుపుతోంది. తీరంలో బలమైన భూకంపం సంభవించింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో అంతా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే, ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది కానీ ఆ ప్రాంతంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు ఇప్పటివరకి జారీ చేయలేదు. భూకంపం వల్ల ప్రవాహాలు సముద్రమట్టాల్లో మార్పులు మాత్రం సంభవించాయని న్యూ ఇయర్ టైమ్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బీచ్ కి దూరంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
భూకంపం సంభవించిన ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా అంచనాకు రాలేకపోతున్నారు. దాదాపు 60 మందికి పైగా మృతి చెందవచ్చు అని సీనియర్ అధికారి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. మహాసముద్రంలో రింగా ఫైర్ ఉన్నందున ఎల్లప్పుడూ భూకంపం సంభవిస్తూ ఉంటాయి. ఇది టెక్నిక్ ప్లేట్ కదలికలు తరచూ భూకంపాలు అగ్నిపర్వతార్లకు కారణమవుతున్నాయి.
#BREAKING : A magnitude 7.0 earthquake has struck Northern Cebu, sending tremors across much of the Visayas and Bicol Region. #PhilippinesEarthquake #M7Quake #Philippines #EarthquakeAlert #NaturalDisaster #StaySafe #Cebu #Visayas #Bicol pic.twitter.com/rmJVQplaC7
— ViralVolt? (@ViralVolT1) September 30, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం చర్చి వద్ద భూకంపం సంభవించడంతో అది తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి లైట్స్ అన్ని కింద పడిపోయినాయి. ఇది సెబూ ప్రొవిన్స్ లో బోగో నగరానికి ఈశాన్యంగా 17 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. ప్రజలు కూడా ఒకసారిగా భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు ప్రాణం పరుగులు తీశారు. ప్రావిన్స్ లో దాదాపు 90000 మందికి పైగా జనాభా ఉంటుంది.
?A magnitude 6.9 #earthquake destroyed a #Catholic church in the Philippines, according to media reports.
The tremors were felt most strongly on the island of #Cebu.
There are no casualty reports yet. Footage is being shared on social media. pic.twitter.com/FBkGiA4277
— News.Az (@news_az) September 30, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.