)
Russia Earthquake Video: భారీ భూకంపం సంభవించడంతో రష్యా మరోసారి ఉలిక్కిపడింది. కామ్చాట్కా తీర ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి ఒక్కసారిగా కంపించింది. అయితే, జూలై నెలలో కూడా 8.8 శాతం తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో వెంటనే భవనాల్లో ఉన్న ప్రజలు పరుగులు తీశారు. ఈ భూకంపం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే దీన్ని ప్రకటించింది. ఇది 39 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. అయితే ఈ భారీ భూకంపం తర్వాత పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా సునామి హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉందని చెప్పింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో మరింత ప్రమాదకరంగా ఉండవచ్చు అన్నది. ఇక జూలై నెలలో కూడా 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది ఆ సమయంలో జపాన్, అమెరికా, హవాయి, కోస్తారికా ప్రాంతాలు సునామీ హెచ్చరికలు జారీ చేశారు
కమ్చట్కా ద్వీపకల్పం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగంగా పరిగణిస్తారు. ప్రతిరోజు ఇక్కడ ఎన్నో భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే అవి లోలోపనే జరుగుతుంటాయి. పెద్ద ఎత్తున వినాశకరంగా భూకంపాలు అప్పుడప్పుడు సంభవిస్తాయి. 1952లో కమ్చట్కాలో ఏకంగా 9.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇక ఇప్పటివరకు అంతా పెద్దగా భూకంపం తీవ్రత నమోదు కాలేదు. భారీ భూకంపం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక భవనంలో భూకంపం ధాటికి అది ఊగిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Video from 7.5 earthquake in Kamchatka, Russia. pic.twitter.com/9M6nUkTVyO
— Brian’s Breaking News and Intel (@intelFromBrian) September 13, 2025
అయితే యూఎస్ జియలాజికల్ సర్వే ప్రకారం శనివారం తెల్లవారుజామున కమ్చట్కా ప్రాంతంలో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అయితే భూకంపం ధాటికి ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం, సంభవించలేదు. కానీ సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.