Salary Hike: ఎవరూ ఊహించని జాక్‌పాట్‌.. 500 శాతం జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

Jackpot 500 Percent Salary Hike For Top Lawmakers In Pakistan: ఊహించని రీతిలో జీతాలు పెరిగాయి. నెలవారీ జీతాలు 500 శాతం పెరగడంతో వారికి జాక్‌పాట్‌ తగిలింది. జీతాల పెంపు వార్తతో ఆ కుటుంబాలు భారీ స్థాయిలో లబ్ధి పొందాయి. మరి ఆ స్థాయిలో జీతాలు ఎవరికీ పెరిగాయి? ఎక్కడ అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 9, 2025, 09:13 PM IST
Salary Hike: ఎవరూ ఊహించని జాక్‌పాట్‌.. 500 శాతం జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

Pakistan Salaries Hike: భారీ.. భారీ ఎత్తున జీతాలు పెరిగాయి. కనివినీ ఎరుగని రీతిలో వేతనాలు పెరిగాయి. ఊహించని రీతిలో జీతాలు పెరగడంతో జాక్‌పాట్‌ తగిలింది. జీతాల పెంపు వార్త యావత్‌ దేశాన్ని నివ్వెరపర్చింది. ఎవరికీ జీతాలు పెరిగాయి.. ఎంత మోతాదులో జీతాలు పెరిగాయనే వివరాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. చట్టాలు రూపొందించే శాసన కర్తలకు ఈ స్థాయిలో జీతాలు పెంచారు. అది ఎక్కడో కాదు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో 500 శాతం జీతాలు పెరిగాయి. స్పీకర్‌, మంత్రులు, శాసనసభ్యుల జీతాలు ఊహించని స్థాయిలో పెంచుతూ పాకిస్థాన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: 2% DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెరుగుదల.. కనీస వేతనంలో భారీగా మార్పులు
జీతాల పెంపు
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌ తాజాగా ప్రజాప్రతినిధుల జీతాలు భారీగా పెంచడం గమనార్హం. జీతాలు పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మే 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన జీతాలు 1, జనవరి 2025 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. జీతాల పెంపుతోపాటు అందే ఇతర భత్యాలు, సౌకర్యాలకు సంబంధించి కూడా భారీగా మార్పులు ఉండనున్నాయి.

Also Read: Thalliki Vandanam: 'తల్లికి వందనం' రూ.15 వేలు రావాలంటే ఏమేం కావాలి? ఏ పత్రాలు ఉండాలి?

==> కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులు సలహాదారుల జీతాలు 188 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన జీతంతో ఇప్పుడు అందుకుంటున్న రూ.2 లక్షల నుంచి రూ.5,19,000 చొప్పున భారీగా జీతం పెరగనుంది.

==> ఎంపీలు, సెనేటర్ల జీతాలు రూ.5,19,000కు పెంచుతూ జీతాల పెంపు నిర్ణయానికి పాకిస్థాన్‌ ఆర్థిక కమిటీ ఆమోద ముద్ర వేసింది. గతంలో కేంద్ర మంత్రులు రూ.2 లక్షలు, రాష్ట్ర మంత్రులు రూ.1.8 లక్షలు వేతనంగా పొందేవారు.

==> అసెంబ్లీ స్పీకర్‌, చైర్మన్‌ల జీతాలు రూ.10 లక్షల 30 వేలకు పెంచుతూ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వీరికి గతంలో నెలకు రూ.2 లక్షలు జీతంగా ఉండేది. అంటే వీరి జీతం దాదాపు 500 శాతం పెరగడం గమనార్హం. ప్రపంచంలో ఎవరి జీతాలు కూడా ఇంతలా ఉండవని చెప్పవచ్చు.

==> ఈ జీతాల పెంపును పాకిస్థాన్‌లోని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. అధికార పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ మౌనంగానే స్వాగతించాయి. జీతాల పెంపుపై ఎలాంటి నిరసన వ్యక్తం చేయకపోవడం విశేషం

తీవ్ర దుమారం
ఇప్పటికే పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అత్యధికంగా పాకిస్థాన్‌లో నమోదవుతోంది. పొదుపు చర్యలు చేపట్టాల్సి ఉండగా భారీ స్థాయిలో జీతాలు పెంచుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రజలు కష్టాల్లో ఉంటే పాలకులు మాత్రం రికార్డు స్థాయిలో జీతాలు పెంచుకోవడం సరికాదని ఆర్థిక నిపుణులతోపాటు అక్కడి సాధారణ ప్రజలు కూడా చెబుతున్నారు. క్రికెటర్లకు జీతాలు తగ్గించిన ప్రభుత్వం పాలకులకు మాత్రం 500 శాతం పెంచుకోవడంపై తీవ్ర దుమారం రేపుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News