Mexico Blast Videos: మెక్సికోలోని వాల్డోస్ సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ భారీ పేలుడు డిపార్ట్మెంటల్ స్టోర్లో జరిగింది. దీంతో భయంతో జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గర ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితులలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. సోనోరా స్టేట్ గవర్నర్ ఆల్ఫోన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో దగ్గరలోనే ఇతర అనేక వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. చూస్తున్న నిమిషాల్లోనే మంటలు వ్యాపించాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో పొగ కూడా వ్యాపించడానికి ప్రధాన కారణం ట్రాన్స్ఫార్మర్ కూడా అయి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సూపర్ మార్కెట్ కి లోకల్ గా ఉన్న చాలా మంది వస్తూ ఉంటారు. అయితే మొదటగా దీన్ని టెర్రరిస్ట్ చర్యగా అనుమానం వ్యక్తం చేసినా ఇది ప్రమాదమేనని అధికారులు ధ్రువీకరించారు.
🇲🇽 A huge explosion at a Waldos store in downtown Hermosillo, #Mexico on Saturday, causing a fire that killed several people.
The blast happened around 2 p.m., trapping customers inside.
Authorities say at least 14 people may have died, including 8 minors, and more than 23… pic.twitter.com/om84EyaNjf— Info Connect (@infoconnectnow) November 2, 2025
ఇక మెక్సికన్ ప్రెసిడెంట్ క్లౌడియా షీన్బామ్ ఈ ఘటనకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేధికగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ దురాజోను కూడా వెంటనే ఘటనకు సంబంధించి పరిస్థితులను ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా ఆదేశించారు. ఇక మృతుల కుటుంబాలకు కూడా తగిన సహాయక చర్యలు చేపట్టాలి. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
At least 23 #killed in #Waldos explosion in #Mexico's #Sonora state.‼️
•••••••••••••••••••••••••••••••••••••••••••••••••Tragedy in #Hermosillo — a powerful blast ripped through a Waldos store, leaving massive destruction and pic.twitter.com/0amBzrDWH4
— Threat Disseminator Hub Team (@nickngei2) November 2, 2025
మెక్సిలోని ఇదే ప్రాంతంలో సెప్టెంబర్ నెలలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. అందులో 19 పరిస్థితి మరింత విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పేలుడు వల్ల మరో 18 వాహనాలకు కూడా నిప్పంటుకున్నాయి.
Read more: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశికి బిగ్ గుడ్‌న్యూస్, వీరికి మాత్రం వెన్నుపోటే..!
Read more: రేపటి నుంచి అన్నీ కాలేజీల నిరవధిక బంద్.. తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









