)
Mexico Rains Videos: మెక్సికో అతలాకుతలమవుతుంది. ఎడతెరపి లేకుండా కురిసిని వర్షాలకు వీధులన్నీ జలమయం అయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వారం రోజులుగా కురుస్తున్న కుండబోత వర్షాలకు 41 మందికి పైగా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. మరో 27 మంది గల్లంతయ్యారు వేలాది ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక విద్యుత్ పునరుద్ధరణ కూడా సమయం పడుతుంది. రోడ్ల మరమ్మత్తులు చేసి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లారిటీ షిన్ బామ్ తెలిపారు.
ఈ వర్ష బీభత్సానికి 12 అడుగుల ఎత్తులో వీధులన్నీ నీట మునిగాయి. కార్లు, భవనాలు కొట్టుకుపోయిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు . ఇక మెక్సికోలోని పోజురికాలోని కాజోన్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీనివల్ల ఎత్తయిన భవనాలు, కారులు సైతం కొట్టుకుపోయాయి. అయితే శనివారం కాస్త తగ్గుముఖం పట్టి మళ్ళీ దీని వరద భీభత్సం పెరిగింది.
41 మంది మృత్యువాత..
ఇక మెక్సికోలో భారీ వర్షాలు, వరదల కారణంగా 41 మందికి పైగా మృతి చెందారు. ఇందులో పలువురు గల్లంతయ్యారు అని అధికారులు చెబుతున్నారు. ఇక వేరా క్రూజ్ లో కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి చెందగా దాదాపు 27 మంది తప్పిపోయారు. వారి ఆచూకీ కోసం గుర్తిస్తున్నారు. మరో ప్రాంతంలో 16 మంది మరణించారు. మొత్తానికి ఇక్కడ 16 వేలకు పైగా ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి అని నిర్ధారించారు.
10.10.2025 #Mexico
Rains in Mexico caused rivers to overflow their banks and flood streets in Poza Rica. Water levels reached more than 7 meters, inundating infrastructure. Homes, businesses, and roads were completely submerged. Cars were washed away. pic.twitter.com/m2pb0iab6R— Climate Review (@ClimateRe50366) October 10, 2025
ఇక మెక్సికో వరదల వల్ల ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. భారీ వర్షాలకు పశ్చిమ తీరాన్ని దాటిన ఉష్ణ మండల తుఫానులు ప్రిస్సిల్ల, రేమండ్ కారణంగా అధికారులు తెలిపారు. ఈ వరద బీభత్సానికి రోడ్లన్నీ శిథిలావస్థకు చేరుకొని వంతెనలు కూడా తెగిపోయాయి. పడవలు, విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సైనికులు సహాయక చర్యలు చేపట్టారు.
?? Las inundaciones han dejado un saldo devastador: cientos de animales fallecidos ??? y comunidades enteras bajo el agua.
Ciudadanos denuncian que el gobierno estatal aseguró que no había riesgo de desbordamiento, pese a las fuertes lluvias que azotaron la región. Nota… pic.twitter.com/YRkgB88IEk
— Plano Informativo (@Planoinforma) October 13, 2025
Heartbreaking ? A puppy clings to a fence, fighting to survive the devastating floods in Poza Rica, Veracruz, Mexico yesterday.pic.twitter.com/RgesHQLIGn
— Volcaholic ? (@volcaholic1) October 11, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి