Miss World 2025: తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు..

Miss World 2025: 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మే 7 నుండి మే 31 వరకు జరగనున్న ఈ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు టూరిజం శాఖ సెక్రెటరీ స్మిత సబర్వాల్, మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మొర్లే వెల్లడించారు. హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ ప్రారంభ, ముగింపు వేడుకలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రాండ్‌ ఫినాలే  ిక్కడ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 20, 2025, 10:35 AM IST
Miss World 2025: తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు..

Miss World 2025: ప్రపంచ దేశాల సుందరాంగులు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మన హైదరాబాద్ లో జరగనున్నాయి.ప్రపంచంలోని అందగత్తెలు అందరూ ఓ చోట చేరడం.. అందులో ఒకరు విన్నర్ అవ్వడం. ఈ వేడుకని చూసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధమవ్వడం.. ఇలా ఉంటుంది ప్రతి యేడాది పరిస్థితి. అందాల పోటీల్లో ఏ దేశపు అందగత్తె కిరీటాన్ని అందుకుంటుందని అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కాంపిటీషన్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇయర్  మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి.

Add Zee News as a Preferred Source

2024లో 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. 28 ఏళ్ళ తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది భారత్. ఈ పోటీలో జెక్ రిపబ్లిక్ కి చెందిన క్రిస్టినా పీజ్కోవా మిస్ వరల్డ్ గా గెలుపొందింది. 1996లో మొదటిసారి భారత దేశంలో  మిస్ వరల్డ్ పోటీలు జరగగా ఈ పోటీల్లో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మిస్ వరల్డ్ పోటీలకు మన దేశం వేదిక కానుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ అండ్ సీఈఓ జూలియా మూర్లే తెలిపారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

వార్షిక మిస్ వరల్డ్ ఫైనల్స్‌ను పర్యవేక్షించే బాధ్యత కలిగిన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, పోటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్‌లుగా మార్చింది. ఈ సంస్థ వికలాంగులు .. వెనుకబడిన పిల్లలకు సాయం చేసేందుకు  స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించింది. 100 కంటే ఎక్కువ దేశాలలో ఫ్రాంచైజీలతో, మిస్ వరల్డ్ అందాన్ని మించిన ప్రపంచ వేదికగా మారుతుంది.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News