)
Modi Fires On Trump: భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రంప్ చేసిన తీవ్ర విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. విమర్శలు చేసే వాళ్లకి గణాంకాలే సమాధానం చెప్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రధాని మోదీ ఇటీవలే ట్రినిడాడ్ & టొబాగో పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. "ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. మన దేశం సాధిస్తున్న వృద్ధి, ప్రగతి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా అందుతుంది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనం" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఇప్పుడు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నివేదికలు బలం చేకూరుస్తున్నాయి. 2025లో ప్రముఖ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందని అంచనా వేశారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని గతంలో ఘనా దేశంలో పర్యటన అప్పుడు కూడా మోదీ ప్రస్తావించారు. ప్రపంచ వృద్ధిలో భారతదేశపు వాటా దాదాపు 16 శాతంగా ఉందని ఆయన గుర్తుచేశారు. అంకుర సంస్థల వ్యవస్థలోనూ భారత్ మూడో స్థానంలో నిలిచిందని.. ఆ తర్వాత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వంటి డిజిటల్ చెల్లింపుల్లోనూ భారత్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని మోదీ స్పష్టం చేశారు.
సంక్షేమం పథకాలైన ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం, దేశీయ తయారీకి ప్రోత్సాహకాలు వంటివి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేశాయని ఎకానమీ నిపుణులు అంటున్నారు. ఎకానమీలో దూసుకుపోతున్న జర్మనీ, జపాన్ వంటి దేశాలను అధిగమించి ఇప్పుడు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ట్రంప్ వంటి విమర్శకులకు ప్రధాని మోదీ ఈ లెక్కలతో సమాధానమిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook