Video: మోదీ.. జిన్‌పింగ్‌, పుతిన్‌ను కలవడం సిగ్గుమాలిన చర్య.. భారత్‌పై అదేపనిగా ట్రంప్‌ సలహాదారు విమర్శ!

Peter Navarro Sensational Comments Video: భారత్ పై మరోసారి ట్రంప్ సన్నిహితులు ట్రేడ్ అడ్వైసరీ అయిన పీటర్ నవారో నోరు పారేసుకున్నారు. భారత్‌పై ఇష్టారీతినా కామెంట్ చేస్తూ రెచ్చిపోయారు. మోదీ.. పుతిన్‌, జింపింగ్ కలవడం ఒక సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యలు చేశారు. ఎస్సీఓ సమావేశంలో భాగంగా మోదీ పుతిన్‌, జింపింగ్ కలవడాన్ని ఆయన ఇలా అక్కసు వెళ్లగక్కారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Sep 2, 2025, 02:56 PM IST
Video: మోదీ.. జిన్‌పింగ్‌, పుతిన్‌ను కలవడం సిగ్గుమాలిన చర్య.. భారత్‌పై అదేపనిగా ట్రంప్‌ సలహాదారు విమర్శ!

Peter Navarro Sensational Comments Video: భారత్ పై మరోసారి అమెరికా నోరు పారేసుకుంది. మోదీ.. జింపింగ్, పుతిన్‌లు కలవడం ఒక సిగ్గుమాలిన చర్య అని అమెరికా ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో స్పందించారు. ఆయన ఇలా భారత్‌పై రెచ్చిపోయారు. ఇటీవల జపాన్ నుంచి చైనా వెళ్లి అక్కడ  SCO మీటింగ్‌లో పాల్గొన్న జింపింగ్, మోదీ, జింపింగ్ కలవడాన్ని ఆయన సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మోదీ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం వెళ్లి ఇద్దరు డిక్టేటర్లను కలవడం ఏంటి? ఎప్పటికైనా మోదీ అమెరికాతోనే స్నేహం చేయాలి. రష్యా.. చైనాతో కాదు అని పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source

మొత్తానికి మోదీని నియంతల హగ్గర్‌ అని కూడా పిలిచారు. ఇదో పెద్ద సిగ్గుచేటుగా అయినా అభివర్ణించారు. అమెరికా, యూరప్‌, ఉక్రెయిన్‌తో భారత్ ఉండాలి. కానీ రష్యాతో కాదు అని నవారో అన్నారు. అమెరికా మన భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలుపెట్టాక దేశ ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా తో పాటు బలమైన దేశాలు అయిన రష్యా, చైనా దేశాలతో ప్రత్యక్ష సంబంధాల కోసం మోదీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

 ఇటవలె అమెరికా భారత్‌పై 50 శాతం సుంకం విధించింది. అప్పటినుంచి అక్కసు వెళ్లగకుతూనే ఉంది అమెరికా. ప్రధానంగా ఎసీఓ సమావేశంలో మోదీ, పుతిన్‌, జింపింగ్ కలిసి ఉండటాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారు. ఇటీవల యూరప్ దేశాలు కూడా భారత్‌పై సుంకాలు విధించాలని కూడా అమెరికా పెద్దన్న డోనాల్డ్ ట్రంప్ కు వాళ్లకి ఆదేశించారు. దీనిపై ఇంకా యూరప్ దేశాలు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

 

 

సోమవారం కూడా నవారో ఇలాగే భారత్‌పై కామెంట్ చేశారు. భారత్‌లోని బ్రాహ్మణులు చమురు కొనుగోలు చేసి బాగా అర్జిస్తున్నారు. పేదలు మాత్రం ఎలాంటి అర్జనా పొందటం లేదు అని వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్‌పై రష్యా దాడికి డబ్బు ఇస్తోందని అన్నారు. అందుకే అత్యంత సుంకాలను కూడా భరించాల్సి వస్తుందని వ్యాఖ్యలు చేశారు.

ఇక అమెరికా ట్రెజరీ కార్యదర్శి కాట్ బెసెంట్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఆయన నరేంద్ర మోడీ ఎస్సీఓ సమావేశం ఒక బూటకమని అన్నారు. అమెరికా భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశాలు అవి సమస్యలను కూడా పరిష్కరించుకోగలమని చెప్పుకోచ్చారు. అయితే సోమవారం చైనాలో జరిగిన ఎస్సిఓ సమావేశంలో ముగ్గురు మోదీ, చైనా, పుతిన్‌ కలిసిన ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే..

Read more: ఉద్యోగినితో ఎఫైర్‌తో నెస్లే సీఈఓపై వేటు.. ఇంతకీ లారెంట్‌ ఫ్రెయిక్స్‌ ఎవరు?

Read more: భారత్‌ను లక్ష్యంగా చేసుకోండి అంటూ యూరప్‌ దేశాలకు పిలుపు.. మరోకుట్రకు తెరలేపిన డోనాల్డ్‌ ట్రంప్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News