US Strom: అమెరికా పెను తుపాన్ కారణంగా గజగజా వణికిపోతోంది. పెద్దెత్తున టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. దుమ్ముధూళితో కూడిన బలమైన గాలులు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 100కుపైగా కార్చిచ్చులు చెలరేగాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
మిస్సోరీలో బేకర్స్ ఫీల్డ్ ప్రాంతంలో టోర్నడో ధాటికి ఇద్దరు మరణించగా..పలువురికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. టెక్సాస్ పాన్ హ్యాండిల్ లోని అమరిల్లో కౌంటీలో మరో ముగ్గురు మరణించారు. మిస్సోరీలో టోర్నడోలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో స్థానికంగా పలు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలబామా, కెంటకీ, మిసిసిపీ, టెనసీ, ఇల్లినోయి, ఇండియానా, టెక్సాస్, టెన్నెసీ రాష్ట్రాలకు టోర్నడోల ముప్పు పొంచి ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Gold vs Stock Market: బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్..భవిష్యత్ లో ఎందులో మంచి రాబడి ఇస్తుంది?
కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సాస్, కాన్సస్ లలో కార్చిచ్చులు చెలరేగడంతో ఆయా ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని నివాసితులను ఆదేశించింది.
Also Read: Ex MP Vijayasai Reddy: కోటరీ కుట్రలు.. జగన్ పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు?
అటు మిన్నెసొటా, సౌత్ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుపాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని..అయితే ఈసారి విస్త్రుతి, తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి