UAE Death Penalty: సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో హత్య ఇతర నేరాలకు కఠినమైన శిక్షలు అమలవుతుంటాయి. మరణశిక్ష పడిందంటే వెంటనే అమలు కావల్సిందే. ఓ హత్య కేసులో ఇద్దరు భారతీయులకు తాజాగా మరణశిక్ష అమలైందని యూఏఈ అధికారులు స్పష్టం చేశారు.
యూఏఈలోని ఓ ట్రావెల్ ఏజెన్సీ ఏఐ ఎయిన్స్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన మొహమ్మద్ రినాష్ ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. పీవీ మురళీధరన్ అనే మరో వ్యక్తి కూడా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసుల్లో ఆరోపణలు రుజువు కావడంతో యూఈఏ ఇద్దరికీ మరణశిక్ష అమలు చేసింది. ఇద్దరిపై ఉన్నవి హత్యానేరాలు కావడంతో మరణశిక్ష, తప్పలేదని విదేశాంగ శాఖ తెలిపింది. చివరి చూపు కోసం కుటుంబీకుల్లో ఇద్దరి చొప్పున యూఏఈ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని విదేశాంగ అధికారులు స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ ఇద్దరికీ మరణ శిక్ష ఫిబ్రవరి 28న ఖరారు చేశారు. ఇప్పటి వరకూ యూఏఈలో ఇండియాకు చెందిన 28 మందికి మరణశిక్ష పడింది.
గతంలో యూపీకు చెందిన 33 ఏళ్ల మహిళ షెహజాదీ ఖాన్‌ను ఫిబ్రవరి 15న ఉరి తీశారు. తన సంరక్షణలో ఉన్న నాలుగు నెలల చిన్నారి మరణానికి కారణమైందనేది ఆమెపై ఉన్న అభియోగం. చిన్నప్పుడు వేసే టీకాల తరువాత ఆ చిన్నారి ప్రాణాలు పోయాయి. కానీ ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆ చిన్నారి ప్రాణాలు పోగొట్టుకుందని వాదనలు విన్పించారు. ఇలా వివిధ కారణాలతో యూఏఈలో భారతీయులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీటిలో కొన్ని నిజంగా నేరం చేసినవాళ్లే కాగా కొంతమంది మాత్రం అన్యాయంగా కేసుల్లో చిక్కుకున్నవాళ్లే.
Also read; Heera Gold Scam: మూడు నెలల్లో 25 కోట్లు చెల్లించకుంటే మళ్లీ జైలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









