Myanmar Earthquake Death Toll Rises: రెండు రోజుల కిందట మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించడంతో మృతుల సంఖ్య నానాటికి పెరిగిపోతూ ఉంది. ఇప్పటివరకు 1700 మంది మృతి చెందాలని అధికారికంగా ప్రకటించారు. అయితే 3,400 మంది గాయపడి ఉంటారని జాతీయ మీడియా సంస్థ కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు ముగిసేసరికి పదివేలకు మృతుల సంఖ్య చేరుకోవచ్చని యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే అంచనా వేసింది.
మయన్మార్‌లో 15 లక్షల మందికి పైగా ఈ ప్రకృతి విలయం ప్రభావం చూపింది. రిక్టార్ స్కేల్ పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెనువెంటనే కూడా భూకంపాలు సంభవించాయి. ఎత్తయిన భవనాలు కూడా కుప్పకూలడంతో అందులో చాలామంది చనిపోయారు. మృతదేహాల నుంచి దుర్వాసన కూడా వస్తుంది. సహాయక చర్యలు నాటి నుంచి చేపడుతూనే ఉన్నారు. అయితే సమయం గడిచే కొద్ది శిథిలాల కింద ఉన్న వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారన్న అనుమానాలు మొదలయ్యాయి.
గాయపడినవా వారిని రక్షించడానికి అనేక బృందాలు వెంటనే ఆసుపత్రికి చేర్చుతున్నాయి. అయితే ఈ భూకంపం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భూకంపం నేపథ్యంలో ఎక్కువమంది చనిపోయారు. రిక్టార్ స్కేల్ పై 7.7 తీవ్రతతో సంభవించింది. ఈ భూకంపం ధాటికి మొత్తం మయన్మార్ నగరం మొత్తం స్మశాన వాటికల మారిపోయింది. మండే ఎండలో శవాలు కుళ్ళిపోయి దుర్వాసన కూడా వస్తోంది. ఇక ప్రాణాలతో బయటపడ్డ వారు తమ కుటుంబీకుల కోసం వెతుకులాట ప్రారంభమైంది.
ఇదీ చదవండి : Earthquake: ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవిస్తుంది? దాని వినాశనం ఎలా ఉంటుంది తెలుసా?
మరోవైపు శిథిలాలకు కింద ఉన్న కొంతమంది నుంచి అరుపులు కూడా వినిపిస్తున్నాయి. కానీ రిస్క్యూ టీమ్ అక్కడికి త్వరగా చేరుకోలేక పోతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న అన్నారు కానీ పెద్ద ఎత్తున శిథిలాలు ఉండడంతో వారిని కాపాడడానికి కాస్త జాప్యం జరుగుతోంది. చేతులు, కాళ్లు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది. అయితే నిన్న ఆదివారం కూడా మరోసారి మయన్మార్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో మరోసారి ప్రజలు తీవ్ర భయాందోళనతో కేకలు వేస్తూ దేవుళ్లను ప్రార్థించారు.
ఇదీ చదవండి : Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే వేసవిసెలవులు ప్రారంభం..
ఇప్పటికే మయన్మార్ లో భూకంపం ధాటికి చాలామంది నిరాశ్రయులు అయ్యారు. అంతర్యుద్ధంతో ఇప్పటికే దారుణ పరిస్థితిలో ఉన్న మయన్మార్‌కు ఇది మరో చేదు వార్త. థాయిలాండ్ లో కూడా దీని ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటివరకు 15 లక్షల మందిలో చాలామంది వీధుల్లోనే గడుపుతున్నారు.
China's national rescue team successfully pulled a female resident alive from the wreckage of a collapsed hotel in quake-hit Mandalay City in Myanmar at 00:40 local time on March 31 -- nearly 60 hours after a 7.7-magnitude earthquake struck the country.https://t.co/NA2Mp2CyMQ pic.twitter.com/YQQJfyRwHj
— CCTV+ (@CCTV_Plus) March 31, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









