Myanmar Earthquake ISRO Visuals: మయన్మార్ భూకంపం విజువల్స్ తాజాగా ఇస్రో విడుదల చేసింది. దృశ్యాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అధునాతన ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం అయిన కార్టోసాట్ 3 ఈ ఫోటోలను తీసింది. భూకంపం ఎంత స్థాయిలో మయన్మార్‌ను ముంచేసిందో ఈ చిత్రాలు చూస్తే తెలుస్తోంది. మయన్మార్‌లోని సాగేంగ్- మండలే సరిహద్దు ప్రాంతంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఇది కేంద్రీకృతమైందని తెలుస్తోంది.
7.7 శాతంతో సంభవించిన ఈ భారీ భూకంపం తర్వాత కూడా పలుమార్లు భూకంపం వచ్చింది. రెండోసారి రిక్టారు స్కేలుపై 6.4 తీవ్రతతో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో థాయిల్యాండ్‌లోని పలు ప్రాంతాలు కూడా ప్రభావితం అయ్యాయి. ఎతైన భవంతి కూలిపోవడంతో ఒక్కరు కూడా మిగలలేరు. అంతేకాదు కొంతమంది రంజాన్ సందర్భంగా నమాజ్ చేస్తున్నారు. ఆ సమయంలో భూకంపం రావడంతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇది కాకుండా ఓ 33 అంతస్థుల ఆసుపత్రి కూడా కుప్పకూలిపోయింది.

భారత్ నుంచి ఆపరేషన్ బ్రహ్మ పేరిట సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే, పెద్ద ఎత్తున శిథిలాలు పేరుకుపోవడంతో వాటిని కట్ చేస్తూ.. అడ్డు తొలగిస్తూ వారిని చిక్కుకున్నవారికి బయటకు తీసే చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది చనిపోగా డెడ్ బాడీల నుంచి దుర్వాసన కూడా వెదజల్లుతోంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
అయితే, ఈ ఉపగ్రహం సాగైంగ్‌లోని మా క్సీ ఖానా పగోడా, మఠాలు ఇతర భవనాలు కూడా దెబ్బతిన్న విజువల్స్ తీసింది. ఇక ఈ ఇస్రో కార్టోసాట్-3 ఉపగ్రహం 2019 లో ప్రయోగించారు. 500 కిలోమీటర్ల ఎత్తు నుండి మయన్మార్ ప్రభావిత ప్రాంతాల చిత్రాలను సంగ్రహించింది. ఇందులో మయన్మార్‌లోని మండలే, సాగైంగ్‌లో కూలిపోయిన భవాలు, రోడ్లతోపాటు మరిన్ని చారిత్రక దృశ్యాలను సంగ్రహించింది. ఈ చిత్రాలతో గత నెల మార్చి 18వ తేదీ చిత్రాలను సరిపోలుస్తూ తీసిన ఫోటోలు ఇవి.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
మొన్నటి వరకు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన మయన్మార్‌కు ఇది అతి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. రాజధాని నెపిడాలోని ప్రధాన ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇన్వా నగరంలోని నదిపై నిర్మించిన ఓ వంతెన కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఇక ఈ భూకంపం సాగింగ్ ఫాల్ట్ ఒత్తిడి విడుదల చేయడంతో ఏర్పడిందని ఇస్రో భావిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









