Myanmar Earthquake: భారీ భూకంపం ధాటికి మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో మృతుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మాయన్మార్‌లో దాదాపు 1000 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక థాయిలాండ్ పరిస్థితి కూడా అంతే ఇక ఘటన సమయంలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయి తీవ్ర గాయాలతో మరికొంతమంది బయటపడ్డారు. వారిని రిస్క్యూ ఆపరేషన్ల ద్వారా వెంటనే బయటకు తీస్తున్నారు. కానీ దానికి సమయం మరింత పడేలా ఉంది. ఇక ఈ ప్రాంతాల్లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవిస్తోంది. ఈ ధాటికి ఆ దేశాలన్నీ వణికిపోయాయి.
మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. బిల్డింగ్స్ ఒక్కసారిగా ఊగిపోయి కళ్ల ముందే కూలిపోయాయి. ఆ విజువల్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. రెండు భవనాలను కలిపే వంతెన లాంటి నిర్మాణం కూడా కూలిపోయింది. అదృష్టవశాత్తు బిల్డింగ్స్ కులకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే భూకంపం వల్ల పలు భవనాలు నేలమట్టం కాకవడంతోపాటు వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇక ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఇప్పటివరకు 200 మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించిన అనధికారిక లెక్కల ప్రకారం వెయ్యి మంది వరకు మరణించి ఉండవచ్చు అని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చు అని పేర్కొంది. అర్థరాత్రి మరోసారి భూమి కల్పించడంతో ఈ ప్రాంతాల్లోని జనాలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.
ALSO READ: Today Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశికి ఎలా ఉంటుంది?
మయన్మార్ దేశ రాజధాని నెప్పిడాలో వేయి పడగలను ఆసుపత్రి కూడా కుప్పకూలిపోయింది. ఇందులో క్షతగాత్రులు చిక్కుకున్నట్టు తెలుస్తుంది. పక్కనే ఉన్న ఎత్తైన భవనాలు, ఆలయాలు కూడా కుప్పకూలిపోయాయి. ఇంకా మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి చైనా సైతం ఊగిపోయింది. ఈ భూకంపానికి అక్కడ యునాన్ ప్రావిన్స్‌లోని భవంతి పైనున్న రూఫ్ ఆఫ్ స్పూన్ పొంగి నీళ్ళు కిందకు పడ్డాయి .ఆ నీటిలో ప్రజలు కొట్టుకుపోయారు. పలువురికి తీవ్ర గాయాలు అవ్వగా మరణాలు మాత్రం సంభవించలేదు.
అయితే మాయన్మార్ భూకంపం విజువల్స్ మాత్రం భయానకంగా ఉన్నాయి. రిక్టార్ స్కేల్ పై 7.7 తీవ్రతతో నమోదైంది. భూకంపం ధాటికి పలుచోట్ల భూమిపై భారీ పగుళ్లే వచ్చాయి. కొన్ని అడుగుల లోతు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు బ్యాంకాక్ నుంచి బయటపడేందుకు పర్యాటకులు విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు.
భారీ భూకంపంతో అతలాకుతలమైన మాయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ఆదేశానికి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపనుంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యవసర సరుకులు కూడా ఉండనన్నాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి IAFC ఎయిర్ క్రాఫ్ట్ లో వీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
High-rise building collapses due to strong #earthquake in Chatuchak, Bangkok. #แผ่นดินไหว #กรุงเทพมหานคร pic.twitter.com/fiRV6ZIZq2
— Weather Monitor (@WeatherMonitors) March 28, 2025
ఇదిలా ఉండగా తీవ్ర భూకంప ప్రకంపనాలతో ఉలిక్కిపడిన మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. రెండోసారి తీవ్రత 4.2 రిక్టార్ స్కేల్ పై నమోదయింది. అంతకుముందు థాయిలాండ్ లో కలిపి 7.7 తీవ్రతతో భూకంపం రావడంతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి.
#BREAKING A 7.9-magnitude earthquake struck Myanmar, according to the China Earthquake Networks Center.
Neighboring regions, including Thailand and China's Yunnan Province, felt significant tremors. #Myanmar #earthquake pic.twitter.com/qgRHQ7ltjl
— 鳳凰資訊 PhoenixTV News (@PhoenixTV_News) March 28, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









