
Myanmar Earthquake: సరిగ్గా సూర్య గ్రహాణానికి ఒక రోజు ముందు సంభవంచిన భూకంపంతో థాయిలాండ్ తో పాటు మయన్మార్ లో దారుణ పరిస్థితులు నెలకున్నాయి. రెండు రోజులు గడుస్తున్న నేపథ్యంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది. తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేకమంది తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా అనేక ప్రాంతాలకు సహాయక బృందాలు చేరలేదని సమాచారం. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా. మయన్మార్‌లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం అనేక నగరాలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా మాండలేలో భారీ భవనాలు, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలతోపాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోవడం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో భారీ పరికరాలు లేకుండానే రంగంలోకి దిగిన స్థానికులు.. ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు రోజులుగా వరుస భూ ప్రకంపనలు మయన్మార్వాసులను బెంబేలెత్తుతున్నారు. వరుస ప్రకంపనల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందనే భయాలు స్థానికుల్లో నెలకొన్నాయి. దీంతో 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో చాలావరకు ప్రజలు రాత్రి వేళల్లో వీధుల్లోనే నిద్రపోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో మరోసారి భూకంపం రావడంతో స్థానికులు కలవరపాటుకు గురయ్యారు.
భూకంప తీవ్రతకు థాయ్‌లాండ్‌లో 33 అంతస్తుల నిర్మాణ భవనం కుప్పకూలింది. అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే, వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు వెల్లడించారు.ఇప్పటివరకు బయటకు తీసిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరన్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, భారీ అంతస్తు కుప్పకూలిన ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe