Modi: మోడీ స్ట్రాటెజీ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతున్న పాకిస్తాన్.. ట్రంప్ కు షాక్..

Narendra Modi: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో పాటు పీవోజేకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టారు. ఈ ఘటన తర్వాత పాక్ భారత్ లోని జనావాసాలపై డ్రోన్లతో దాడికి యత్నించి విఫలమైంది. దీంతో శరణు అంటూ అమెరికా కాళ్లపై పడింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సీజ్ ఫైర్ ప్రకటించినా.. మళ్లీ పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పాక్ తో చర్చలకు మోడీ మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్ తో చెక్ పెట్టారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 12, 2025, 08:10 AM IST
Modi: మోడీ స్ట్రాటెజీ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతున్న పాకిస్తాన్.. ట్రంప్ కు షాక్..

Narendra Modi: జమ్మూ కాశ్మీర్ సహా పాకిస్థాన్ తో ఏ అంశమైన ఇరు దేశాలు కూర్చొని చర్చించుకోవాలన్నదే ముందు నుంచి భారత్ అనుసరిస్తున్న విధానం. ఓవైపు భారత్.. ఎయిర్ స్ట్రైక్స్ తో కేవలం పాకిస్థాన్ లోని మిలటరీ స్థావరాలు.. జనావాసాలపై  కాకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలనే గురి పెట్టి లేపేసింది. కానీ పాకిస్థాన్ మాత్రం అంతకు ప్రతిగా మన దేశంలోని వివిధ నగరాల్లో జనవాసాలపై డ్రోన్స్ తో  బాంబ్ దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ మన దేశంపైకి దాదాపు అన్ని బాంబు దాడులను తిప్పి కొట్టింది. దీంతో భారత్.. పాకిస్థాన్ లోని మిలటరీ స్థావరాలతో పాటు కరాచీ నేవల్ పోర్ట్ తో లాహోర్, ఇస్లామాబాద్ లలోని వ్యూహాత్మక ప్రాంతాలనే టార్గెట్ చేసింది.

తాజాగా ట్రంప్.. 10వ తేది సాయంత్రం ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించినట్టు ట్వీట్ చేశారు. అయితే.. సీజ్ ఫైర్ కు అంగీకారం తెలిపిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ నేపథ్యంలో సడెన్ యుద్ధ విరామం ప్రకటించడంపై మిశ్రమ స్పందన వ్యక్తం అయింది. తాజాగా పాకిస్థాన్ విషయంలో అమెరికా సహా ఏ దేశం జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. తాజాగా ఇదే విషయమై.. ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత పీవోజేకేు స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటేనన్నారు. పీఓకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాకిస్థాన్ కు  మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.  దీనిపై ఇక మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవన్నారు.  లేదన్నారు. ఆపరషన్ సిందూరు ముగియలేదని ప్రధాని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని అన్నారు. పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే.. భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పులతో సమాధానం చెబుతుందన్నారు. ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు త్రివిధ దళాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు.

కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లో ఉగ్రదాడులు జరుగకుండా ఉండాలంటే.. పీవోజేకేను భారత్‌కు అప్పగించడం తప్ప మరో మార్గం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేం లేదని అన్నారు. పీవోజేకే అంశంలో మధ్యవర్తులు మాట్లాడొద్దు అని అమెరికా అధ్యక్షుడికి  స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాకిస్తాన్ మాట్లాడితే తాము కూడా మాట్లాడుతామని అన్నారు. ఈ అంశం తప్ప వేరే అంశంపై చర్చించే ఉద్దేశం తమకు లేదని కుండబద్దలు కొట్టారు. ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఇరు దేశాలకు చెందిన డీజీసీఏ అధికారుల మధ్య భేటి జరగనుంది. దీనిపై ఇరు దేశాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి.

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News