Dolphins Welcome: సునీతా విలియమ్స్‌కు స్వాగతం చెప్పిన డాల్ఫిన్లు, వీడియో ఇదిగో

Dolphins Welcome: కధ సుఖాంతమైంది. 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , విల్మోర్ క్షేమంగా భూమ్మీద ల్యాండ్ అయ్యారు. ఆమె రాక కోసం ప్రపంచమే కాదు జంతుజాలం కూడా ఎదురుచూచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2025, 10:21 AM IST
Dolphins Welcome: సునీతా విలియమ్స్‌కు స్వాగతం చెప్పిన డాల్ఫిన్లు, వీడియో ఇదిగో

Dolphins Welcome: నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ దిగ్విజయంగా, క్షేమంగా భూమిపైకి ల్యాండ్ అయ్యారు. 9 నెలల సుదీర్ఘ సమయం తరువాత ఎట్టకేలకు స్పేస్‌ఎక్స్ క్రూ 9 మిషన్ క్షేమంగా ఇద్దరు వ్యోమగాముల్ని తీసుకొచ్చింది. ఫ్లోరిడా సముద్ర జలాలపై క్యాప్యూల్ ల్యాండ్ కాగానే ఆమెకు డాల్ఫిన్లు స్వాగతం పలికాయంటే ఆశ్చర్యంగా ఉందా..వీడియో మీరే చూడండి

గత ఏడాది జూన్ 5వ తేదీన అంతరిక్షంలో వెళ్లిన నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్‌లు అక్కడే చిక్కుకుపోయారు. స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఖాళీగా తిరిగొచ్చేసింది. వారం రోజుల ప్రయాణం కాస్తా 9 నెలలైపోయింది. చివరికి స్పేస్‌ఎక్స్ సహాయంతో నాసా చిక్కుకుపోయిన ఇద్దరినీ క్షేమంగా తీసుకురాగలిగింది. 9 నెలల సుదీర్ఘ విరామం తరువాత సునీతా విలియమ్స్-విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీ అత్యంత ఉత్కంఠ రేపింది. 22 ఏళ్ల క్రితం కల్పనా చావ్లా ఘటన గుర్తుకురావడంతో ఏం జరగకూడదని సర్వత్రా ప్రార్ధనలు చేశారు. ఎట్టకేలకు భారత కాలమానం ప్రకారం ఫ్లోరిడాలోని అట్లాంటిక్ మహా సముద్రం జలాల్లో క్యాప్యూల్ క్షేమంగా ల్యాండ్ అయింది. సముద్ర జలాల్లో క్యాప్యూల్ ల్యాండ్ కాగానే దాని చుట్టూ సముద్రజలాచరాలు డాల్ఫిన్స్ చుట్టూ చేరాయి. 

సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికేందుకే వచ్చినట్టు చుట్టూ కాస్సేపు తిరిగాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు..దాదాపు 5-6 డాల్పిన్లు చుట్టూ తిరిగాయి. సునీతా విలియమ్స్‌కు ఆహ్వానం పలికేందుకే వచ్చినట్టు కన్పించాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

దాదాపు 9 నెలల సుదీర్ఘ సమయం తరువాత సునీతా విలియమ్స్ భూమ్మీదకు రాగానే క్యాప్యూల్ నుంచి నవ్వుతూ బయటికొచ్చారు. అందరికీ హాయ్ చెబుతూ ఉల్లాసంగా కన్పించారు. ఎలాంటి ఆందోళన, బలహీనత కన్పించలేదు. ఆరోగ్యంగా ఉన్నట్టు కన్పించారు. 

Also read: Sunitha Williams: 286 రోజుల తర్వాత భూమి మీదకు సురక్షితంగా సునీత.. ఇప్పుడు ఎలా ఉందో వీడియో చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News