Sunita Williams Return Journey: సునీతా విలియమ్స్ రిటర్న్ టు ఎర్త్ జర్నీలో ఏ క్షణం ఏం జరిగింది, ల్యాండింగ్ ఎలా జరిగింది

Sunita Williams Return Journey: నాసా వ్యోమగాముల రిటర్న్ టు ఎర్త్ కథ సుఖాంతమైంది. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు క్షేమంగా భూమి పైకి తిరిగొచ్చారు.ఐఎన్ఎస్ నుంచి ఫ్లోరిడా జలాల్లో ల్యాండింగ్ వరకూ ఎప్పుడు ఏం జరిగింది పరిణామ క్రమం గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2025, 01:15 PM IST
Sunita Williams Return Journey: సునీతా విలియమ్స్ రిటర్న్ టు ఎర్త్ జర్నీలో ఏ క్షణం ఏం జరిగింది, ల్యాండింగ్ ఎలా జరిగింది

Sunita Williams Return Journey: అంతరిక్షంలో చిక్కుకున్న నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా  భూమిపై దిగారు. 9 నెలలుగా చిక్కుకున్న ఈ ఇద్దర్నీ రప్పించేందుకు చేపట్టిన స్పేస్‌ఎక్స్ క్రూ 10 మిషన్ విజయవంతమైంది. ఇదేమీ అంత ఈజీగా సాగిన యాత్ర కానే కాదు. అడుగడుగునా సవాళ్లు, ఇబ్బందులు దాటుకుంటూ ఆద్యంత టెన్షన్ కల్గిస్తూ సాగిన సాహసోపేతమైన జర్నీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి మదిలో 22 ఏళ్ల క్రితం కల్పనా చావ్లా విషయంలో జరిగిన ఘటన గుర్తుంది. 

Add Zee News as a Preferred Source

అంతరిక్షం నుంచి ఫ్లోరిడాలోని అట్లాంటిక్ మహా సముద్ర జలాల్లో క్యాప్యూల్ క్షేమంగా ల్యాండ్ అయ్యేవరకు వివిధ పరిణామ క్రమాల గురించి తెలుసుకుందాం. మొత్తం జర్నీ దశలవారీగా జరిగింది. భూమి వైపుకు 17 గంటల ప్రయాణంలో ఎప్పుడు ఏం జరిగిందో పరిశీలిద్దాం.

భారత కాలమానం ప్రకారం మార్చ్ 18 మంగళవారం ఉదయం 8.15 గంటలకు స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక క్లోజ్ అయింది. ఆ తరువాత సరిగ్గా రెండు గంటలకు అంటే ఉదయం 10.15 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో క్రూ డ్రాగన్ విడిపోయే ప్రక్రియ ప్రారంభమైంది. దీనినే అన్‌డాకింగ్ అంటారు. 10.35 గంటలకు పూర్తిగా విడిపోయి భూమి దిశగా 17 గంటల ప్రయాణం ప్రారంభించింది. దీనికోసం రాకెట్‌ను పలుసార్లు మండించారు. క్రూ డ్రాగన్ ముందు భాగంలోని నాలుగు డ్రాకో ఇంజన్ల ప్రజ్వలన మొదలైంది.

2.17 గంటలకు స్పేస్ క్రాఫ్ట్ రిటర్న్ టు ఎర్త్ ప్రక్రియ ప్రారంభమై 3.10 గంటలకు భూ వాతావరణంలో ప్రవేశించింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్‌ఎక్స్ గ్రౌండ్ స్టేషన్‌తో 3.11 గంటలకు సిగ్నల్ కట్ అయింది. 3.21 తిరిగి సిగ్నల్ కలిసింది. క్యాప్యూల్ భూమికి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉందనగా నాలుగు పారాచూట్స్ తెర్చుకున్నాయి. 3.28 గంటలకు డ్రాగన్ మాడ్యూల్ సురక్షితంగా సముద్రంలో దిగింది.

సముద్రానికి 18 వేల అడుగుల ఎత్తులో  పారాచూట్లు తెర్చుకోవడంతో గంటకు 560 కిలోమీటర్ల వేగం కాస్తా గణనీయంగా గంటకు 190 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఆ తరువాత సముద్రజలాలకు 6500 అడుగుల ఎత్తులో మరో రెండు పారాచూట్లు తెర్చుకోవడంతో క్యాప్యూల్ వేగం మరింతగా తగ్గింది. పారాచూట్లు వేగాన్ని నియంత్రిస్తుంటే క్యాప్సూల్ క్రమంగా సముద్ర జలాల్లో దిగింది. క్షణాల్లోనే స్పీడ్ బోట్లలో సహాయక బృందాలు చేరుకుని పరిస్థితి అంతా సాధారణంగా ఉందని నిర్ధారించుకున్నారు. క్యాప్యూల్‌ని మేగన్ నౌకపైకి చేర్చి లోపల ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లతో పాటు వీరిని తీసుకొచ్చేందుకు వెళ్లిన కమాండర్ నిక్ హేగ్, అలెగ్జాండర్ ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. స్టెచర్‌‌పై మెడికల్ సెంటర్‌‌కు తరలించారు.

Also read: Dolphins Welcome: సునీతా విలియమ్స్‌కు స్వాగతం చెప్పిన డాల్ఫిన్లు, వీడియో ఇదిగో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News