Vikram lander's debris photos on moon | ముక్కలు ముక్కలైన విక్రమ్ ల్యాండర్.. చెల్లాచెదురుగా పడిపోయిన శిథిలాలు

చంద్రయాన్-2(Chandrayan-2)లో భాగంగా పంపించిన విక్రమ్ ల్యాండర్ ముక్కలైపోయింది. చంద్రుని దక్షిణ ధృవంలో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం వెతుకుతున్న నాసాకు తాజాగా విక్రమ్ ల్యాండర్(Vikram lander) శిథిలాలు కనిపించాయి.

Updated: Dec 3, 2019, 10:40 AM IST
Vikram lander's debris photos on moon | ముక్కలు ముక్కలైన విక్రమ్ ల్యాండర్.. చెల్లాచెదురుగా పడిపోయిన శిథిలాలు

చంద్రుని ఉపరితలంపై పరిశోధనల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. మూడు నెలల క్రితం చంద్రునిపై పరిశోధనల కోసం చంద్రయాన్-2(Chandrayan-2)లో భాగంగా పంపించిన విక్రమ్ ల్యాండర్ ముక్కలైపోయింది. చంద్రుని దక్షిణ ధృవంలో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) తీవ్రంగా ప్రయత్నించింది. మరోవైపు విక్రమ్ ల్యాండర్ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(NASA) కూడా అప్పటి నుంచి వెతుకుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నాసాకు విక్రమ్ ల్యాండర్(Vikram lander) శిథిలాలు కనిపించాయి. ఇంపాక్ట్ సైట్ నుంచి తీసిన చిత్రాలను నాసా తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. నాసాకు చెందిన లునార్ రికనసెన్స్ ఆర్బిటర్(LRO) ఈ చిత్రాలు తీసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకిన తర్వాత ముక్కలైందని.. అవి కొన్ని కిలోమీటర్ల వరకు చెల్లాచెదురుగా పడిపోయాయని నాసా పేర్కొంది. దాదాపు 24 ప్రదేశాల్లో శిథిలాలు కనుగొన్నామని వివరించింది. 

Read also : విక్రమ్‌ ఆచూకీ కోసం రంగంలోకి దిగిన నాసా