Nepal Earth Quake: నేపాల్ లో భూకంపం.. ఉత్తర భారతంలో భయం భయం..

Nepal Earth Quake: ప్రపంచ వ్యాప్తంగా భూపకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. రీసెంట్ గా మయన్నార్ సహా ఇతర దేశాల్లో సంభవించిన భూకంపాలను మరిచిపోకముందే నేపాల్ లో భూకంపం సంభవించింది. ఒకసారి కాదు.. రెండు సార్లు ఆ దేశంలో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 5, 2025, 09:01 AM IST
Nepal Earth Quake: నేపాల్ లో భూకంపం.. ఉత్తర భారతంలో భయం భయం..

Nepal Earth Quake: భారత్ పక్క దేశం మయన్మార్‌లో సంభవించిన భూకంప విధ్వంసం మరువక ముందే  భారత్ ను అనుకొను ఉండే  నేపాల్‌లో రెండు సార్లు భూమి కంపించింది. అయితే అక్కడ స్వల్ప భూకంపాలు సంభవించాయి. అవి  రిక్టర్‌ స్కేల్‌పై 5.5, 5.2 తీవ్రతగా నమోదయ్యాయి. జాజర్‌కోట్ జిల్లాలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:07 గంటలకు 5.2 తీవ్రతతో మొదటి భూకంపం నమోదైంది. ఆ తర్వాత రాత్రి 8:10 గంటలకు 5.5 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని జాతీయ భూకంప పర్యవేక్షణ కేంద్రం తెలిపింది.

Add Zee News as a Preferred Source

నేపాల్ రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన దాదాపు 525 కి.మీ దూరంలో ఉన్న జాజర్‌కోట్ జిల్లాలోని పానిక్ ప్రాంతంలో రెండు భూకంపాల కేంద్రం ఉంది. పశ్చిమ నేపాల్‌లోని సుర్ఖేట్, దైలేఖ్, కాలికోట్‌తో సహా పొరుగు జిల్లాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంపాల తీవ్రత ఉన్నప్పటికీ, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. ఈ భూకంపాల ప్రభావం ఉత్తర భారత్‌ను ఇవి తాకినట్లు తెలిసింది. ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పలు చోట్ల భూప్రకంపనలు వచ్చినట్లు సమాచారం.

ఇలా వుండగా పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదు అయింది. పశ్చిమ న్యూ బ్రిటన్‌ ప్రావిన్స్‌లోని కింబే పట్టణానికి 194 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం.  దీంతో అమెరికా సునామీ హెచ్చరికలు జారీచేసి విత్‌ డ్రా చేసుకుంది. .

ఇటీవలే మయన్మార్‌, థాయ్‌లాండ్‌లలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.  ఈ ఘటనలో ఒక్క మయన్మార్‌లోనే మూడువేల మందికిపైగా చనిపోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు కొనసాగుతున్నాయి.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News