)
Nepal gen z protests Agitators torch pm kp oli sharma residence video: నేపాల్ లో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. రోడ్లపై ఆందోళన కారులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసనలకు దిగారు. ఈ క్రమంలో ఇప్పటికే నిరసన కారుల్ని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 20 మంది దుర్మరణం చెందగా, మరో 300 మంది వరకు గాయపడ్డారు. దీంతో నిరసన కారులు, పోలీసుల మీదకు దాడులకు తెగపడ్డారు.
మరోవైపు కేపీ శర్మ ఓలి.. దుబాయ్‌కు వెళ్లిపోయేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా ఆర్మీ విమానంలో ఆయన వెళ్లిపోయేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చిన వేళ.. ఆయన ఏకంగా రాజీనామాను చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
? Breaking: Protesters set fire to PM KP Oli’s residence in Balkot amid escalating unrest. ??#NepalProtests #BreakingNepal #KPOli #Balkot #NepalCrisis #YouthMovement #NepalNews pic.twitter.com/hnVlx27Us8
— TikTube X News (@TikTubeXNews) September 9, 2025
నేపాల్ ప్రధాని ఓలీ.. ఆర్మీ అధికారుల సూచనల మేరకు తన పదవికి రాజీనామా చేశారు. ఓలీ నిర్ణయం రాజీనామా నిర్ణయంతో.. దేశం పగ్గాలు ఆర్మీ చేతుల్లోకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియా నిషేధానికి నిరసనగా మొదలైన ఈ ఉద్యమం మంగళవారం కూడా కొనసాగుతోంది. ఆందోళన కారులు.. మాజీ ప్రధాని ప్రచండ ఇంటిపై దాడి చేశారు. భక్తపూర్ లోని బాల్కోట్ లో ఉన్న ప్రధాన మంత్రి ఓలి నివాసాన్ని నిరసన కారులు తగలబెట్టారు.
ఓలి ప్రస్తుతం బల్వతార్ లోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో ఉన్నారు. లలిత్ పూర్ లోని సున కోఠిలో కమ్మూనికేషన్ మంత్రి సుబ్బ గురుంగ్ నివాసంపై కూడా ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. అలాగే ప్రస్తుత మంత్రి ప్రిత్వీ సుబ్బా గురుంగ్ ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 20 మంది మరణించారు.
మరో 300 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 100 మంది పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హోం మంత్రి రమేష్ లేఖక్ ఇప్పటికే రాజీనామా చేయగా, వ్యవసాయ శాఖ మంత్రి రామనాథ్ కూడా రాజీనామా చేశారు. మరోవైపు కేపీ శర్మ ఈ అల్లర్లలో మృతి చెందిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగాన్ని ఆపాలనే ఉద్దేశం మాకు లేదని ఒక ప్రకటనలో కేపీ ఓలి శర్మ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook