)
Nepal Social Media Ban protests: నేపాల్ రాజధాని ఖాట్మండులో GEN-Z పేరుతో చెలరేగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది యువత ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఖాట్మండులో కర్ఫ్యూ విధించింది. ప్రధాని కెపి శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం.. సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై బ్యాన్ విధించింది. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను బ్యాన్ చేయడంతో.. యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రధాని ఓలి తీరును ఆందోళనకారులు తీవ్రంగా తప్పుపట్టారు. మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఖాట్మండుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. వెంటనే సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తూ.. యువత పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ ఉద్యమం ఆన్లైన్ ఆందోళనగా మొదలై.. పార్లమెంట్ భవనంపైకి దాడి చేసే వరకూ వెళ్లింది. పార్లమెంట్ లోపలికి చొచ్చుకుపోయిన యువతపై.. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణల్లో 16 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయాలయ్యాయని ప్రాథమిక సమాచారం. ఆందోళనకారులు మోటార్ సైకిళ్లు తగలబెట్టడం, ప్రభుత్వ ఆఫీసులపై దాడులు చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
?Breaking news:- Youth brigade's fierce protest against Nepal government in Kathmandu, youth took to the streets against corruption and social media ban.
This movement of Nepali youth is absolutely justified.??#socialmediaban#Nepal #kathmandu #protest pic.twitter.com/f9E7mZrlg9
— Aman Verma (@aman9950) September 8, 2025
ప్రస్తుతం ఖాట్మండుతోపాటు విరాట్‌నగర్, భరత్పూర్, పోఖ్రా వంటి 10 నగరాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం ఖాట్మండు, పోఖరా వంటి నగరాల్లో కర్ఫ్యూ విధించింది. నేపాల్ ఆర్మీని రంగంలోకి దింపింది. ప్రధాని ఓలి ఈ నిషేధాన్ని దేశీయ గౌరవం కోసం తీసుకున్న నిర్ణయంగా సమర్థించుకున్నారు. సోషల్ మీడియా కంపెనీలు స్థానికంగా రిజిస్టర్ చేసుకోవాలని.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే, ఆందోళనకారులు దీనిని ప్రభుత్వ అణచివేతగా, అవినీతి , అసమర్థతకు వ్యతిరేకంగా చూస్తున్నారు. ఓలి చోర్, దేశం ఛోడ్ (ఓలి దొంగ, దేశం వదిలి వెళ్లు) అంటూ ఉద్యమం చేస్తున్నారు.
ప్రభుత్వం వాక్ స్వేచ్ఛను అణచివేస్తోందని, వ్యాపారాలకు ఇబ్బంది కలిగిస్తోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియా కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏడు రోజుల గడువు ఇచ్చినా, చాలా కంపెనీలు విఫలమయ్యాయని ప్రభుత్వం చెప్పింది. టిక్‌టాక్‌తో సహా కొన్ని కంపెనీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. నేపాల్‌లో చాలా మంది విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా కుటుంబాలతో సంబంధాలు నిర్వహిస్తారు. ఈ నిషేధం వల్ల దేశంలో గందరగోళం నెలకొంది.
#WATCH | Nepal | Protestors vandalise the Parliament gate as the protest turned violent in Kathmandu, as people staged a massive protest against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters pic.twitter.com/dkh9Mg7BGc
— ANI (@ANI) September 8, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.