)
Nepal pm kp sharma oli resigns as gen z deadly protests: నేపాల్ సోషల్ మీడియా మీద బ్యాన్ కాస్త ఆ దేశాన్ని కుదిపేస్తుంది. ఈ క్రమంలో ఆందోళన కారులు రెచ్చిపోయారు. రోడ్లపైకి వచ్చి హింసాత్మక ఘటనలకు కారణమయ్యారు. ఆందోళలన కారులను అదుపులోకి తీసుకొని రావడానికి పోలీసులు లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ లను, కాల్పులకు కూడా పాల్పడ్డారు.
Nepalese PM K.P. Sharma Oli steps down as mass protests sweep the nation. pic.twitter.com/rozZ0ADDaO
— Polymarket Intel (@PolymarketIntel) September 9, 2025
ఈ అల్లర్లు కాస్త అదుపు తప్పాయి. ఏకంగా మంత్రులు, దేశ ప్రధాని అధికారిక నివాసాలకు, మంత్రుల నివాసాలకు నిప్పులు పెట్టడం వరకు వెళ్లింది. ఎక్కడ చూసినహింసాత్మక ఘటనలు, అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి . ఇప్పటికే ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు.
తాజాగా.. దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి సైతం సంచన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేపీ ఓలి శర్మ ప్రకటించారు. నేపాల్ లో జరిగిన అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది చనిపోగా, మరో 300 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. సైన్యం సూచనతో పదవి నుంచి కేపీ శర్మ ఓలి తప్పుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిరసనలకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook