డొనాల్డ్ ట్రంప్ తో అఫైర్ ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖండించారు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ. ట్రంప్ తో అఫైర్ అని వాఖ్యలు చేయడంపై ఫైర్ అయ్యారు. మైకేల్ ఉల్ఫ్ రాసిన "ఫైర్ అండ్ ఫ్యురీ" పుస్తకంలో ట్రంప్ తో హేలీకి అఫైర్ ఉందని రాయడంతో ఈ వదంతులు వ్యాపించాయి. ట్రంప్ తో ప్రెసిడెన్సియల్ విమానంలో, కార్యాలయంలో నిక్కీ చాలాసేపు ఏకాంతంగా గడిపారని ఉల్ఫ్ పుస్తకంలో పేర్కొన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై స్పదించిన నిక్కీ.. ఇది పూర్తిగా అబద్దమని.. అసభ్యంగా రాశాడని చెప్పారు. విమానంలో తాను ఉన్నప్పుడు అక్కడ చాలా మంది ఉంటారని గుర్తుచేశారు. కార్యాలయంలో కూడా తాను రాజకీయ భవిష్యత్తు గురించే తప్ప.. పర్సనల్ విషయాలు మాట్లాడనని.. తాను ఎప్పుడూ అధ్యక్షుడిని ఒంటరిగా కలవలేదని స్పష్టం చేశారు. ఒక మహిళపై ఇలాంటి దిగుజారుడు వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఇవన్నీ ఒట్టి వదంతులే అని.. వాటిలో నిజంలేదని చెప్పారు. 


ట్రంప్ తరువాత అధ్యక్ష పదవికి వెళ్లేది నిక్కీహేలీ అని, తనను తాను ట్రంప్ వారసురాలిగా భావిస్తోందని 'ఫైర్ అండ్ ఫ్యురీ' పుస్తకంలో ఉల్ఫ్ రాయడంతో ఈ అంశంపై గతంలో వార్తలు వచ్చాయి.